ప్రభాస్ బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. లేదంటే ఇప్పటి వరకు షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు. హైదరాబాద్ లో సుదీర్ఘ షెడ్యూల్ తో సినిమా మెజార్టీ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కాని కరోనా సెండ్ వేవ్ ఓమ్ రౌత్ ప్లాన్స్ అంతా రివర్స్ అయ్యేలా చేసింది. ఆదిపురుష్ సినిమా రెగ్యులర్ షూటింగ్ మళ్లీ మొదలు పెట్టడంకు సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో సుదీర్ఘ షెడ్యూల్ కు ముందు ముంబయిలో కొన్ని రోజుల చిన్న షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట. ఆ షెడ్యూల్ పూర్తిగా సైఫ్ అలీ ఖాన్ పైనే ఉంటుందట. లంకేశ్వరుడు రావణుడి పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమాలో ఆయన పాత్ర కూడా హీరో రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. అలాంటి రావణ్ పాత్రకు సంబంధించిన కీలక సన్నివేశాలను ముంబయిలో ప్రత్యేకంగా వేసిన సెట్టింట్ లో తెరకెక్కించబోతున్నారు.
ముంబయి షెడ్యూల్ ను ముగించిన వెంటనే సైఫ్ అలీ ఖాన్ తో సహా మొత్తం యూనిట్ కూడా హైదరాబాద్ చేరుకుంటారని సమాచారం అందుతోంది. హైదరాబాద్ లో షూటింగ్ కోసం ఇప్పటికే పలు చోట్ల ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తున్న ఆదిపురుష్ సినిమా షూటింగ్ ను ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసేలా ఓమ్ రౌత్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే.