'కంటెంట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్' అంటూ ప్రభాస్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్ ను ప్రేక్షకులు ఇంతవరకూ మరిచిపోలేదు. నిజంగానే ఆయనలోని కంటెంట్ ను .. ఆ కటౌట్ ను చూసిన ప్రేక్షకులు, జానపద .. పౌరాణిక పాత్రలకు బాగా సెట్ అవుతాడని అనుకున్నారు. 'బాహుబలి' సినిమా ఆ విషయాన్ని బలపరిచింది. 'అర్జునుడు' .. 'కర్ణుడు' వంటి పాత్రలకు ఆయన బాగా నప్పుతాడని అంతా చెప్పుకున్నారు. కానీ ముందుగా రాముడిగా కనిపించే అవకాశం ఆయనకి 'ఆదిపురుష్' సినిమాతో దక్కింది.
రామాయణ ఇతివృత్తంతో 'ఆది పురుష్' నిర్మితమవుతోంది. ఇది కొన్ని వందల కోట్ల రూపాయల బడ్జెట్ .. కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసే ప్రాజెక్టు. అందువలన ఎక్కడా సమయాన్ని వృథా చేయకుండా చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. భారీ సెట్లు .. కాస్ట్యూమ్స్ .. గుర్రాలు .. రథాలు మొదలైన వాటి కోసమే కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. ప్రభాస్ ఖాళీగా ఉన్నప్పుడు ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను .. లేదంటే ఇతర ఆర్టిస్టులతోను షూటింగును కానిచ్చేస్తున్నారు.
తాజాగా ఈ సినిమా కోసం ఒక భారీ పోరాట సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారట. అందుకు సంబంధించిన సన్నాహాలు జరిగిపోయాయని అంటున్నారు. అయోధ్య నుంచి అడుగు బయటపెట్టిన రాముడు, ధర్మాన్ని రక్షించడం కోసం అనేక మంది అసురులను సంహరించాడు. మరి ఏ అంశానికి సంబంధించిన పోరాటాన్ని చిత్రీకరించనున్నారనేది తెలియాలి. ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ లో పాల్గొనడానికి ప్రభాస్ సిద్ధమవుతున్నాడని చెబుతున్నారు. సీతాదేవిగా కృతి సనన్ నటిస్తున్న ఈ సినిమాలో, రావణుడిగా ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఇక మరో వైపున ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్' షూటింగును కూడా ప్రభాస్ పూర్తి చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్రభాస్ పై చిత్రీకరించారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తుందని అంటున్నారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేసిన తరువాత, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో నాగ్ అశ్విన్ ప్రాజెక్టుపైకి వెళ్లనున్నాడు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఒక అద్భుతంగా మిగిలిపోతుందని నాగ్ అశ్విన్ చెప్పడం, ప్రభాస్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.