రాజమహేంద్రవరం అనబడే రాజమండ్రీ రాజకీయం ఒక్కసారిగా హీట్ గా మారింది. నేతల మధ్య హాట్ హాట్ గా మాటల తూటాలు పేలుతున్నాయి. అధికార వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రాజమండ్రి తన అడ్డా అంటూ ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు. ఇక ఇదే టైమ్ లో అడ్డా నీదో నాతో తేల్చుకుందామా అని అర్బన్ సీటు మీద కన్నేసి సీనియర్ టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావు తనయుడు, అర్బన్ టికెట్ ఆశిస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ బదులిచ్చారు.
ఈయన ఇంకా గట్టిగా చెప్పాలంటే దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడుకు స్వయాన అల్లుడు, ప్రస్తుత ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడుకు అదే వరస. ఆయన సతీమణి ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇలా ప్రముఖ రాజకీయ కుటుంబాల నేపధ్యం నుంచి వచ్చిన శ్రీనివాస్ అలియాస్ వాస్ ఎంపీకే సవాల్ చేస్తూ జవాబు చెప్పారు.
దీంతో కధ మంచి రసపట్టులో పడింది అంటున్నారు.నిజానికి దీనికి కొద్ది రోజుల ముందు ఆదిరెడ్డి భవానీ ప్రెస్ మీట్ పెట్టి తాను ఈసారి పోటీలో ఉండనని, తన భర్త వాసు పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. అంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఆదిరెడ్డి వాసు కోరుకుంటున్నారు అన్న మాట. దీని మీద టీడీపీ అధినాయకత్వం ఏమి ఆలోచిస్తోందో తెలియదు కానీ అర్బన్ లో వాసు బాగా హల్ చల్ చేస్తున్నారు.
ఇపుడు ఆయనకు ధీటైన పోటీ అన్నట్లుగా వైసీపీ రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ, యువకుడైన మార్గాని భరత్ ఢీ అంటున్నారు. భరత్ కి అసెంబ్లీ నుంచి పోటీ చేసే ఆలోచన ఉందా అన్న చర్చ కూడా ఆ పార్టీలో మొదలైంది. నిజానికి వైసీపీకి రాజమండ్రీ సీటు గత రెండు పర్యాయాలుగా కలగానే మారింది. పైగా ఇక్కడ టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది.
దాంతో ఈసారి రాజమండ్రీ అర్బన్ గెలిచి తీరాలని వైసీపీ కూడా పంతంగా ఉంది. ఈ నేపధ్యంలో మరి కోరి అన్నారా లేక హై కమాండ్ ఆశీస్సులు తనకు పూర్తిగా ఉంటాయని భావించి చెప్పారో తెలియదు కానీ మార్గాని భరత్ తన భవిష్యత్తు మార్గం అలా చెప్పేశారు. మరో వైపు చూస్తే వైసీపీలో ఈసారి ఓసీలకు ఈ సీటు ఇవ్వాలని ఉందని అంటున్నారు. దానికి తగినట్లుగా ఆశావహులు కూడా ఉన్నారు.
ఇక ఆదిరెడ్డి కుటుంబానికి టీడీపీలో సీనియర్ నేత మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి నుంచి ఇబ్బందులు ఉన్నాయి. బుచ్చయ్య చౌదరి తానే రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయాలని చూస్తున్నారు. దాంతో ఈ ఇద్దరిలో ఎవరికి చంద్రబాబు టికెట్ ఇస్తారో తెలియదు. ఇలా అటు ఆదిరెడ్డికీ టికెట్ క్లియర్ కాలేదు, ఇటు ఎంపీ మార్గానికి కూడా గ్రీన్ సిగ్నల్ లేదు. కానీ ఈ ఇద్దరు నాయకులు మాత్రం రాజమండ్రీలో బస్తీ మే సవాల్ అంటున్నారు. నీదా నాదా పంతం అని కూడా పందెం కాస్తున్నారు. మరి నిజంగా రెండు పార్టీలూ వీరికే కాండిడేట్లుగా దింపుతాయా అన్నది చూడాలి. అదే జరిగితే భలేగా ఉంటుంది మరి పోరు.