ఈ నేపాలీ బ్యూటీ మ‌నీషా కొయిరాలా లేని లోటు తీర్చేనా?

Update: 2021-07-18 13:30 GMT
సోష‌ల్ మీడియా ఒర‌వ‌డిలో ఓవ‌ర్ నైట్ లో క్రేజీ భామ‌లైపోతున్నారు. ఇన్ స్టా- ట్విట‌ర్- ఎఫ్ బి మాధ్యమాల్ని వేదిక‌గా చేసుకుని హాట్ హాట్ ఫోటోల‌తో కుర్రాకారుని హీటెక్కించి భారీగా ఫాలోవ‌ర్స్ ని ద‌క్కించుకుంటున్న చాలా మంది రంగుల ప్ర‌పంచంలో అవ‌కాశాలు అందుకుని స‌త్తా చాటుతున్నారు. ఒక‌ప్పుడు సినిమా ఛాన్స్ అంటే ఆఫీసుల‌ చుట్టూ ఫోటోలు ప‌ట్టుకుని తిర‌గాల్సి వ‌చ్చేది. కానీ నేడు ముందు సోష‌ల్ మీడియాలో స‌త్తా చాటి అటుపై ద‌ర్శ‌క‌ నిర్మాత‌ల నుంచి పిలుపునందుకుంటున్నారు. సోష‌ల్ మీడియా వ‌ల్ల ప్ర‌తిదీ సులువైంది. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్ని హీరోయిన్లు అయిన భాము చాలా మందే ఉన్నారు.

తాజాగా నేపాలీ బ్యూటీ అతిధి బుద్ధ‌తోకి బాలీవుడ్ లో అవ‌కాశాల‌కు అతి చేరువ‌లోనే ఉంద‌ని తెలుస్తోంది. అతిధి ఇప్ప‌టికే కొన్ని నేపాలీ సినిమాల్లో న‌టించింది. బాలీవుడ్ అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియానే వేదిక‌గా చేసుకుని అంద‌రికీ చేరువ‌వుతోంది. కొన్నాళ్ల‌గా  సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల‌ను హీటెక్కించ‌డంలో ముందుంటుంది. న్యూ ట్రెండీ డిజైన్ వేర్స్ ధ‌రించి ఫోటో షూట్ల తో విరుచుకుప‌డుతోంది. నైట్ వేర్ ఇన్న‌ర్ వేర్ ల‌తో మ‌త్తెక్కిస్తోంది.

నేపాలి అందంగా పేరుగాంచిన అతిధికి ఇప్పుడు  సోష‌ల్ మీడియాలో భారీగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ట్విట‌ర్- ఇన్ స్టా వేదిక‌ల్ని త‌న ఫాలోయింగ్ తో  ఎప్ప‌టిక‌ప్పుడు ఊపేస్తూనే ఉంది. తాజాగా బులుగు రంగు టూపీస్ ల్లో అమ్మ‌డు టూమ‌చ్ హాట్ కంటెంట్ ని ఎలివేట్ చేసింది. ఓ హిల్ టాప్ రిస్టార్ట్ లో అమ్మ‌డు ఇలా హాట్ గా ఈత కోల‌నులోకి దిగ‌డానికి రెడీ అవుతోన్న ఫోటోల‌ను ముందుగా ఫ్యాన్స్ కి షేర్ చేసింది. అలే నైట్ వేరు  నైటీలోనూ అంతే హాట్ గా హీటెక్కిస్తోంది. ప్ర‌స్తుతం ఈ రెండు ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన వారంతా నేపాలీ వెట‌ర‌న్ బ్యూటీ మ‌నీషా కొయిలారా లేని లోటును పూడుస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజానికి బాలీవుడ్ స‌హా సౌత్ లో మ‌నీషా కొయిరాలాకి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. మ‌ళ్లీ నేపాల్ బెల్ట్ నుంచి ఆ స్థాయి వేవ్ క‌నిపించ‌లేదు. ఇటీవ‌ల హిమ‌చ‌ల్ ప్ర‌దేశ్ - మ‌నాలి- చండీఘ‌ర్ నుంచి అధికంగా క‌థానాయిక‌లు బ‌రిలో దిగుతున్నారు.
Tags:    

Similar News