ఫోటో స్టోరీ: ప్రెట్టి గర్ల్ ఇన్ బ్లూ బికిని

Update: 2019-12-05 13:06 GMT
అదితి రావు హైదరీని ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు.  ఎందుకంటే 'చెలియా'.. 'సమ్మోహనం'.. 'అంతరిక్షం'.. 'నవాబ్' లాంటి సినిమాలలో నటించి ప్రేక్షకులకు చేరువయింది. మణిరత్నం స్కూల్ కాబట్టి అదితి క్లాస్.. స్టైల్ వేరు.  మిగతా ఊరమాసు జింతాతల తరహాలో రచ్చగా సోషల్ మీడియాను ఆడుకోదు. అదితి పోస్టులు క్లాస్ గా ఉంటాయి.

తాజాగా అదితి ట్రావెల్ & లీజర్ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసింది.  డిసెంబర్ ఎడిషన్ కవర్ పేజిపై కూడా మెరిసింది.  ఈ ఫోటోషూట్ నుంచే ఒక ఫోటోను తన ఇన్స్టా ఖాతా ద్వారా ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు "బద్ధకంగా ఉండే ఒక మధ్యాహ్నం పూట ఓ కాక్ టెయిల్ తో ఈతకొలను దగ్గర గడపడం సరైన పని" అంటూ మోడరన్ నెటిజన్ల మససులను తెగ రంజింపజేసే క్యాప్షన్ ఇచ్చింది.  ఈ ఫోటోలో బ్లూ కలర్ బికినీలో స్పోర్ట్ షూ ధరించి ఈతకొలను ఒడ్డున సరదాగా కూర్చుంది. వెనకే తెలుపు... నీలం రంగుల్లో రెండు కాక టెయిల్ గ్లాసులు ఉన్నాయి.  అదితి కూర్చున్న పోజు.. ఆ స్కిన్ టోన్ చూస్తే ఎందుకు ఈ భామకు మణి సార్ తన సినిమాల్లో ఆఫర్ ఇస్తారో మనకు అర్థం అవుతుంది.

ఈ ఫోటోకు నెటిజన్ల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.  "బ్యూటిఫుల్ బికినీ".. "స్టన్నింగ్ బ్యూటీ".. "ప్రెట్టి గర్ల్ ఇన్ బ్లూ బికిని" అంటూ కామెంట్లు పెట్టారు. ఇక అదితి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తెలుగులో నాని సినిమా 'V' లో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా తమిళంలో 'సైకో'.. 'తుగ్లక్ దర్బార్' అనే సినిమాల్లో నటిస్తోంది. హిందీలో 'ది గర్ల్ ఆన్ ది ట్రెయిన్' సినిమాలో కూడా నటిస్తోంది.
Tags:    

Similar News