అక్కినేని కోడ‌లిపై హైద‌రాబాద్ హీరోయిన్ ల‌వ్!

Update: 2020-02-24 12:15 GMT
నిప్పు లేనిదే పొగ రాద‌ని అంటారు. తెలిసిన సంగ‌తిని వాస్త‌విక‌  ప‌రిజ్ఞానంతో కొన్ని విష‌యాలు జోడించి ఎనాల‌సిస్ చేస్తారు. ఈ క్ర‌మంలో అప్పుడ‌ప్పుడు ఫిలిం మీడియాపై సినిమా వాళ్లు ఫైర్ అవ్వ‌డం ప‌రిపాటే. తాజాగా అక్కినేని కోడ‌లు స‌మంత‌పై ఎన‌లేని ప్రేమ‌ను కురిపించి మీడియాదే త‌ప్పు అన్న‌ట్టుగా మాట్లాడింది హైద‌రాబాద్ బ్యూటీ అదితి రావు హైద‌రి. అస‌లు వివ‌రాల్లోకి వెళితే...

ఇటీవ‌లే స‌మంత‌-శ‌ర్వానంద్ జంట‌గా న‌టించిన `జాను` ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా ప‌రాజ‌యంతో స‌మంత ..శ‌ర్వానంద్ హీరోగా న‌టించే త‌దుప‌రి సినిమా మ‌హాస‌ముద్రం నుంచి త‌ప్పుకుంద‌ని లీకులంద‌డంతో సోష‌ల్ మీడియాలో ఆ వార్త హైలైట్ అయింది. జాతీయ మీడియాలో సైతం ఇది ప్ర‌చార‌మైంది. అలాగే స‌మంత స్థానంలో అదితిరావు హైద‌రీని తీసుకున్న‌ట్లు ప్ర‌చారం సాగింది. అయితే ఈ వార్త‌ల‌ను...రాసిన సంస్థ‌లను ప్ర‌స్థావిస్తూ హైద‌రాబాద్ బ్యూటీ తాజాగా క‌డిగేసింది. ఒక విజ‌యం లేదా ప‌రాజ‌యం న‌టీన‌టుల భ‌విత‌ను నిర్ధేశించ‌లేవు.

ఆ హీరోతో సినిమా ప్లాప్ అయింద‌ని త‌ర్వాత మరో సినిమా చేస్తే క‌లిసి రాద‌ని ఎలా నిర్ధారించేస్తారు? జ‌యాప‌జాలు ఎవ‌రి చేతుల్లోనూ ఉండ‌వు. ప్రేక్ష‌కులు మాత్ర‌మే  అది డిసైడ్ చేసేది. అంత మాత్రాన ఇలాంటి క‌థ‌నాలు ఏంటి? అని క్లాస్ పీకింది. అలాగే  అధికారికంగా వ‌చ్చే వార్త‌ల‌ను మార్చి రాసేస్తున్నార‌ని..అందులో విష‌యాన్ని...సారాంశాన్ని గ్ర‌హించి రాస్తే బాగుంటుంద‌ని సూచించింది. మ‌రి దీనిపై ఫిల్మ్ మీడియా ఎలా స్పందిస్తుందో చూడాలి.
Tags:    

Similar News