ఆ ఫోటోలు చూసి షాక్.. అప్పటినుంచి నో సెర్చ్

Update: 2019-05-16 13:51 GMT
మనకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తాం? గూగుల్ లో సెర్చ్ చేస్తాం.. సింపుల్ కదా.  మనమే కనుక సెలబ్రిటీలు అయితే మన పేరు సెర్చ్ చేసుకొని మరీ ఏం వస్తుందో చూసుకుంటాం.  వికీ పీడియాలు.. ట్విట్టర్లు.. ఫేస్ బుక్.. ఇన్ స్టాగ్రామ్ లు అన్నిటిలో మన ఫాలోయర్స్ ఏమంటున్నారో చూస్తాం.  అయితే మనందరికీ గూగుల్ తో ప్లెజెంట్ ఎక్స్ పీరియన్స్ ఉంది కానీ అదితి రావు హైదరీకి మాత్రం అంత అద్భుతమైన అనుభవం లేదట. ఈమధ్యే ఒక షో లో ఈ విషయాన్ని వెల్లడించింది.

అదితి ఈమధ్య 'ఫీట్ అప్ విత్ ది స్టార్స్ సీజన్ 2' కు గెస్ట్ గా హాజరయింది. ఈ షోలో తన కెరీర్ మొదట్లో ఎదురైన సంఘటనను వివరిస్తూ తన పేరును గూగుల్ లో సెర్చ్ చేసినప్పుడు వీపు భాగం ఆచ్చాదన లేకుండా ఉన్న తన ఫోటోలు వచ్చాయట.  ఆ సెర్చ్ రిజల్ట్స్ చూసి షాక్ అయిన అదితి అప్పటి నుంచి తన పేరును గూగుల్ లో తన పేరును వెతకడం మానేసిందట.  ఇంతకీ ఆ ఫోటోల సంగతి ఏంటంటే అదితి నటించిన 'ఏ సాలి జిందగీ' ఒక సినిమా లో ఉన్న షాట్స్.  కొత్తలో కాబట్టి అలా నటించిందట.  అయితే గూగుల్ ఎవరిపట్ల తేడా చూపించదు.  ఎవరైనా పేరు సెర్చ్ చేయగానే ఎక్కడినుంచో అన్నిటిని వెతికి మరీ పట్టుకొచ్చి మనం కళ్ళముందు పెడుతుంది.  ఈ విషయంలో గూగుల్ తప్పేమీ లేదు!

అదితి ప్రస్తుతం పని చేస్తున్న సినిమాల గురించి మాట్లాడుకుంటే తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'V' అనే సినిమాలో నటిస్తోంది.  ఈ సినిమాతో పాటుగా తమిళంలో 'సైకో' అనే మరో సినిమాలో కూడా నటిస్తోంది.
   

Tags:    

Similar News