ఫోటో స్టొరీ: చిట్టి పొట్టి నిక్కర్లో అదితి

Update: 2018-09-05 12:35 GMT
2006 లోనే మలయాళం సినిమా 'ప్రజాపతి' తో ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టిప్పటికీ మణిరత్నం సినిమా 'కాట్రు వేలియిడై' డబ్బింగ్ వెర్షన్ 'చెలియా' ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది అదితి రావు హైదరీ.  సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన 'సమ్మోహనం' తో అందరినీ మెప్పించిన ఈ సుందరి బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తుంది. రీసెంట్ గా కాస్మోపాలిటన్ మ్యాగజైన్ ఫోటోషూట్ లో పాల్గొని కవర్ పెజీ పై తళుక్కున మెరిసింది.  

ఓషన్ బ్లూ కలర్ టీ-షర్ట్ తో పాటు బ్లాక్ కలర్ మినీ వేసుకొని ఇన్ షర్ట్ చెసుకొని పూల డిజైన్ ఉండే బెల్ట్ పెట్టుకుంది. దానిపై వైట్ షర్ట్ ను విప్పి అలా పట్టుకొని పోజిచ్చింది. లూజ్ హెయిర్ - లిప్ స్టిక్.. మినిమం మేకప్.  ఇక చేతికి రిస్ట్ బ్యాండ్స్ తప్ప పెద్దగా యాక్సెసరీస్ లేవు. వైట్ కలర్ స్పోర్ట్స్ షూ వేసుకుంది. షర్టు పై 'సి ఎస్ట్ లా' అనే ఇంగ్లీష్ లా కనిపించే ఫ్రెంచ్ ఎక్స్ప్రెషన్ ఉంది. దానర్థం మైనర్ డిజప్పాయింట్ మెంట్.. మరి ఎందుకు నిరాశగా ఉందో ఈ హైదరాబాద్ బ్యూటీ చెప్తేగానీ మనకు తెలీదు.  కానీ అదితి గెటప్ మాత్రం అల్ట్రా స్టైలిష్ గా ఉందని - సెక్సీ లేడీ అని సోషల్ మీడియాలో కామెంట్స్ పడిపోతున్నాయి.

ఇక అదితి నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే వరుణ్ తేజ్ - సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'అంతరిక్షం' లో హీరోయిన్ గా నటిస్తోంది.. మరోవైపు మణి సార్ తాజా చిత్రం 'నవాబ్' లో కూడా ఒక కీలక పాత్ర పోషిస్తోంది.
Tags:    

Similar News