'అదితి' బిర్యానీ పై హీరోయిన్‌ కామెంట్‌

Update: 2020-07-24 01:30 GMT
సోషల్‌ మీడియాలో సెలబ్రెటీల అటెన్షన్‌ సంపాదించేందుకు వారి ఫాలోవర్స్‌ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు. వారు పెట్టే ప్రతి పోస్ట్‌ కు లైక్‌ లేదా కామెంట్‌ పెట్టి వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొన్ని సార్లు నెటిజన్స్‌ సెలబ్రెటీలను ఆకర్షించేందుకు బ్యాడ్‌ కామెంట్స్‌ కూడా చేస్తూ ఉంటారు. తాజాగా హీరోయిన్‌ అదితిరావు హైదరి దృష్టిని ఆకర్షించేందుకు ఆమె అభిమాని గుహన్‌ విభిన్నంగా ఫొటో ఎడిట్‌ చేసి ట్వీట్‌ చేశాడు.

ఒక బిర్యానీలో అదితి హెడ్‌ వరకు ఎడిట్‌ చేసి ట్రాన్స్ఫరెంట్‌ గా పేస్ట్‌ చేశాడు. బిర్యానీ మరియు అదితి కలిసి కనిపిస్తున్న ఆ ఫొటోను ట్వీట్‌ చేయడంతో పాటు దానికి అదితి పలావ్‌ అంటూ పేరు పెట్టాడు. దాన్ని చూసిన అదితి బాబోయ్‌ చంపేశారు అంటూ చాలా స్మైలింగ్‌ ఈమోజీలను పోస్ట్‌ చేసింది. అతడి ఎడిటింగ్‌ ను పాజిటివ్‌ గా తీసుకున్న అదితి రావు హైదరి తను కూడా సరదాగా కామెంట్‌ చేసింది.

తన ఫొటోకు అదితి స్పందించడం పట్ల ఆ అభిమాని తెగ ఆనందపడిపోతున్నాడు. ఓ మైగాడ్‌ నన్ను ఆమె గుర్తించారంటూ నెటిజన్స్‌ తో షేర్‌ చేసుకున్నాడు. సరదాగా ఆ ఫొటోను ఎడిట్‌ చేసినట్లుగా అతడు పేర్కొన్నాడు. ఇక సౌత్‌ సినిమాలతో పాటు బాలీవుడ్‌ సినిమాలు వెబ్‌ సిరీస్‌ లతో బిజీ బిజీగా ఉన్న అదితి రావు హైదరి సోషల్‌ మీడియాలో అభిమానులతో కూడా రెగ్యులర్‌ గా టచ్‌ లో ఉంటూ ఇలా అభిమానులను ఎంటర్‌ టైన్‌ చేస్తూ ఉంటుంది.
Tags:    

Similar News