మణిరత్నం అసిస్టెంట్ గా హైద్రాబాదీ హీరోయిన్

Update: 2017-01-13 05:18 GMT
హైద్రాబాదీ అమ్మాయే అయినా.. అదితి రావు హైదరి ఇప్పటివరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. తమిళ్ లో అరాకొరా సినిమాలు చేసినా.. బాలీవుడ్ లో మాత్రం 8 ఏళ్లుగా ఇరగదీసేస్తోంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ అమ్మడు కాట్రు వల్లయిడాయ్ అనే ఓ తమిళ సినిమా చేస్తోంది. బాలీవుడ్ నుంచి మళ్లీ కోలీవుడ్ పై అమ్మడి కన్ను పడ్డానికి అసలు కారణం.. ఇది మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతుండడమే. కార్తి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు.. డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో కూడా వర్క్ చేసేస్తోందట అదితి. ఇన్నేళ్ల కెరీర్ లో నటనలో ఎన్నో నేర్చుకున్నా.. ఈ భామకు ఫిలిం మేకింగ్ అంటే మక్కువ అని తెలుస్తోంది. అందుకే అవకాశం రాగానే దర్శక దిగ్గజం మణిరత్నం మూవీలో హీరోయిన్ గా అంగీకరించేసి.. అదే సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా అవతారం ఎత్తేసింది.

ఒకవైపు కార్తికి హీరోయిన్ గా నటిస్తూ.. మరోవైపు లైట్ బాయ్స్ తో కలిసి గడిపేస్తూ అందరికీ ఆశ్చర్యానికి గురి చేస్తోందట అదితి. బాలీవుడ్ హీరోయిన్ అనే ట్యాగ్ ఉన్నా.. చిన్న చిన్న వర్కర్క్ తో కూడా కలిసిపోయి జోకులు వేసుకుంటూ సినిమా చేస్తున్న అదితి రావు హైదరిని తెగ పొగిడేస్తోంది సినిమా యూనిట్. ప్రస్తుతం బాలీవుడ్ లో సుధీర్ మిశ్రా తీస్తున్న ఔర్ దేవదాస్.. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో తెరకెక్కనున్న పద్మావతి మూవీల్లో నటిస్తోంది అదితి రావు హైదరి.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News