ఆ డైరెక్టర్ సినిమా ఎన్నాళ్లకెన్నాళ్లకు...

Update: 2015-09-27 13:30 GMT
అరంగేట్రంలోనే భారతీయ సినిమా రూపు రేఖల్ని మార్చేసే సినిమా తీసిన డైరెక్టర్ ఆదిత్య చోప్రా. యశ్ చోప్రా లాంటి లెజెండరీ డైరెక్టర్ వారసుడిగా 21 ఏళ్ల వయసులోనే మెగా ఫోన్ పట్టి.. ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ లాంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తీసిన ఆదిత్య.. ఆ తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయడానికి ఐదేళ్లు పట్టింది. ఆదిత్య రెండో సినిమా ‘మొహబ్బతే’ కూడా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ఇంకో ఎనిమిదేళ్లకు ‘రబ్ నే బనా ది జోడీ’ తీశాడు. అది కూడా మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది, కమర్షియల్ గా సక్సెస్ అయింది. ఐతే మళ్లీ దర్శకత్వం జోలికి వెళ్లలేదు ఆదిత్య. మళ్లీ ఏడేళ్ల విరామం తర్వాత తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడతను.

త్వరలోనే తన దర్శకత్వంలో ‘బేఫికర్’ అనే సినిమా మొదలవబోతున్నట్లు ప్రకటించాడు ఆదిత్య. తన తండ్రి యశ్ చోప్రాతో కలిసి మాట్లాడుతున్న ఓ బ్లాక్ అండ్ వైట్ ఫొటోను జోడిస్తూ తన తర్వాతి డైరెక్టోరియల్ వెంచర్ ను అనౌన్స్ చేశాడు ఆదిత్య. ఈ సినిమా తక్కువ బడ్జెట్లో తెరకెక్కుతుందని.. తన గత సినిమాలతో పోలిస్తే రొమాన్స్ - ఎమోషన్స్ తక్కువుంటాయని.. కమర్షియాలిటీ కూడా తక్కువేనని చెప్పాడతను. అంటే కెరీర్ లో తొలిసారిగా ఓ ప్రయోగాత్మక చిత్రం తీయబోతున్నాడన్నమాట ఆదిత్య. ఇది తన కెరీర్ లో హ్యాపీయెస్ట్, యంగెస్ట్, రిస్కీయెస్ట్ మూవీ అని ఆదిత్య చెప్పడం విశేషం. ఇంకే డైరెక్టర్ కూడా ఇలాంటి అనౌన్స్ మెంట్ చేసి ఉండడేమో. ఐతే ఈ సినిమాకు పని చేసే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల గురించి  ఆదిత్య వెల్లడించలేదు.
Tags:    

Similar News