నిర్మాత కూతురి పెళ్లి.. ఇది పెళ్లి మంట‌ప‌మా? మాయావ‌న‌మా?

Update: 2022-06-23 15:07 GMT
తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో ఎంద‌రో స్టార్లు గ్రాండియ‌ర్ గా పెళ్లి వేడుక‌లు జ‌రుపుకున్నారు. స్టారాధి స్టార్లు.. స్టార్ డాట‌ర్స్ .. యువ‌హీరోల పెళ్లి వేడుక‌లను అభిమానులు క‌నులారా తిల‌కించారు.

కానీ ఇలాంటి అల్ట్రా రిచ్ రాయ‌ల్ వెడ్డింగ్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ చూసి ఉండ‌రు. ఆ రేంజులో అంగ రంగ వైభ‌వంగా స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏషియ‌న్ సునీల్ నారంగ్ కుమార్తె పెళ్లి జ‌రుగుతుండ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ప్ర‌ముఖ నిర్మాత.. వెట‌ర‌న్ పంపిణీదారుడు ..ఎగ్జిబిట‌ర్.. ఏషియ‌న్ సినిమాస్ అధినేత కీ.శే నారాయ‌ణ దాస్ నారంగ్ కుమారుడు ఏషియ‌న్ సునీల్ నారంగ్ కుమార్తె జాన్వీ నారంగ్ వివాహ మ‌హోత్స‌వ‌మిది. జాన్వీ నారంగ్ - ఆదిత్య జంట వివాహ వేడుక క‌న్నుల పండుగ‌ను త‌ల‌పించ‌నుంద‌న‌డానికి ఈ దృశ్యాలు చాలు.

హైద‌రాబాద్ హైటెక్స్ నోవాటెల్ లో రాయ‌ల్ వెడ్డింగ్ నుంచి తాజాగా పెళ్లి వేదిక‌ సెట్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ గా మారాయి.  ఈ పెళ్లి వేడుక‌కు టాలీవుడ్ టాప్ స్టార్లు అగ్ర నిర్మాత‌లు పంపిణీ దారులు ఎగ్జిబిట‌ర్లు స‌హా భారీగా ఆర్టిస్టులు సాంకేతిక నిపుణులు కూడా అటెండ్ కానున్నారు.

టాలీవుడ్ లో అత్యంత గ్రాండియ‌ర్ పెళ్లి ఇంకొక‌టి లేనే లేదు! అనిపించేలా సెట్స్ నిర్మాణం చూస్తుంటే క‌ళ్లు చెదిరిపోతున్నాయి.

ప‌ద్మావత్ .. భాజీరావ్ మ‌స్తానీ సినిమాల కోసం సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించిన సెట్స్ కంటే గ్రాండియ‌ర్ గా  ఈ సెట్స్ క‌నిపిస్తున్నాయ్. భారీత‌నం నిండిన‌ సెట్ల నిర్మాణం కోసమే ఏకంగా కోటి ఖ‌ర్చ‌య్యి ఉంటుంద‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.  ఇటీవ‌లి కాలంలో ఈ రేంజు వెడ్డింగ్ టాలీవుడ్ లో వేరొక‌టి లేనే లేదంటే అతిశ‌యోక్తి కాదు.


Full View
Tags:    

Similar News