అడివి శేష్‌.. అరుదైన రికార్డ్ కి అడుగు దూరంలో..!

Update: 2022-11-05 02:30 GMT
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ కేడీ పాత్రలో నటించిన లేటెస్ట్ క్రైమ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్'హిట్ 2' : ది సెకండ్ కేస్‌'. శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న క్రైమ్ డ్రామా ఇది. ఇన్వేస్టిగేటివ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందిన ఈ మూవీని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై హీరో నేచుర‌ల్ స్టార్ నాని స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌శాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ తో రూపొందించిన'హిట్ : ది ఫ‌స్ట్‌ కేస్'కు సీక్వెల్ గా ఈ మూవీని రూపొందించారు.  

'మేజ‌ర్‌' వంటి పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ త‌రువాత అడివి శేష్ న‌టించిన ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ క్రైమ్ థ్రిల్ల‌ర్ కావ‌డంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. డిసెంబ‌ర్ 2న భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ముందు జూలై 29న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. అయితే'మేజ‌ర్‌' ప్ర‌మోష‌న్స్‌, రిలీజ్ కార‌ణంగా ఈ మూవీ రిలీజ్ ని డిసెంబ‌ర్ 2 కు పోస్ట్ పోన్ చేశారు. సినిమా రిలీజ్ కి డేట్‌, టైమ్ ఫిక్స్ కావ‌డంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ ని మొద‌లు పెట్టారు.

'ఖిలాడీ' ఫేమ్ మీనాక్షీ చౌద‌రి హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ టీజ‌ర్ ని గురువారం మేక‌ర్స్ విడుద‌ల చేశారు. వైజాగ్ నేప‌థ్యంలో సాగే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ గా ఈ మూవీని రూపొందించారు. అడివి శేష్ ఇందులో కృష్ణ దేవ్ అలియాస్ కేడీ అనే  హొమిసైడ్ ఇంటర్వెన్షన్ ఆఫీసర్ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడు. టీజ‌ర్ లో చాలా కూల్ కాప్ గా క‌నిపిస్తున్నా విజువ‌ల్స్, డైలాగ్స్ ని బ‌ట్టి అడివి శేష్ క్యారెక్ట‌ర్ చాలా యార‌గెంట్ గా.. ఎవ‌రినీ లెక్క‌చేయ‌ని విధంగా సాగుతుంద‌ని తెలుస్తోంది.

టీజ‌ర్ ప్రామిసింగ్ గా ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా వుండ‌టంతో ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటూ భారీ హైప్ ని సొంతం చేసుకుంది. ఇదిలా వుంటే ఇందులో న‌టించిన హీరో అడివి శేష్ ఈ మూవీతో అరుదైన రికార్డ్ ని త‌న ఖాతాలో వేసుకోవ‌డానికి రెడీ అవుతున్నాడు.

గ‌త కొంత కాలంగా అడివి శేష్ ఏ సినిమా చేసినా అది మేక‌ర్స్ కి కాసుల వ‌ర్షం కురిపిస్తూ అత‌నికి బ్యాక్ టు బ్యాక్ సూప‌ర్ హిట్ ల‌ని అందిస్తోంది.'పంజా'తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన అడివి శేష్ ఆ త‌రువాత నుంచి సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వ‌రుస విజ‌యాల్ని ద‌క్కించుకుంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు.  

'క్ష‌ణం' నుంచి అడివి శేష్ విజ‌యాల ప‌రంప‌ర అప్ర‌తిహ‌తంగా సాగుతూనే వుంది. ఇప్ప‌టికీ హ్యాట్రిక్ హిట్ ని పూర్తి చేసిన అడివి శేష్ 'మేజ‌ర్'తో వ‌రుస‌గా ఐదవ హిట్ ని సొంతం చేసుకున్నాడు. డిసెంబ‌ర్ 2న విడుద‌ల కానున్న'హిట్ 2' కూడా సూప‌ర్ హిట్ అనిపించుకుంటే అడివి శేష్ డ‌బుల్ హ్యాట్రిక్ ని ద‌క్కించుకున్న‌ట్టు. ఇలా ఇంత వ‌ర‌కు ఏ టాలీవుడ్ హీరో ఈ త‌ర‌హా రికార్డ్ ని సొంతం చేసుకోలేదు.'హిట్ 2' హిట్ట‌యితే అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకున్న హీరోగా అడివి శేష్ స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకోవ‌డం గ్యారంటీ అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News