హీరోని బెదిరించిన పోలీసులు

Update: 2019-08-23 17:30 GMT
టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ అందుకున్న అడివి శేష్ ఏ సందర్భం వచ్చినా తన కష్టాల గురించి చెప్తూ వస్తుంటాడు.  లేటెస్ట్ గా 'ఎవరు' సక్సెస్ మీట్ లో కూడా చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు శేష్. 'పంజా' తర్వాత తనకెదురైన కొన్ని ఇబ్బందులను కూడా చెప్పాడు. పంజా సమయంలో జేబులో డబ్బులు కూడా లేవని అయినా సినిమా అవకాశాల కోసం రిచ్ గా బిహేవ్ చేసేవాడినని తెలిపాడు.

'కిస్' సినిమా తర్వాత చాలా నష్టపోయానని దాదాపు 2 కోట్లు కట్టాల్సి వచ్చిందని, ఆ సమయంలో అప్పుల వాళ్ళ నుండి చాలా ఒత్తిడి ఎదురైందని, పోలీస్ స్టేషన్ కి పిలిచి డబ్బులు తిరిగివ్వాల్సిందిగా పోలీసులు వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో తనను నమ్మే వారు లేరని, ఆలాంటి  క్లిష్టమైన పరిస్థితుల్లో పీ.వి.పీ గారు తనను నమ్మి సినిమా ఛాన్స్ ఇచ్చారని అలాగే అబ్బూరి రవి పంజా నుండి తనను ప్రోత్సహిస్తూ ప్రతీ సినిమాకు డైలాగ్స్ రాస్తూ స్క్రిప్ట్ గైడెన్స్ ఇస్తున్నాడని చెప్పాడు.

ఇక 'ఎవరు' సక్సెస్ తో చాలా హ్యాపీగా ఉన్న ఈ హీరో ఈరోజు తను వచ్చే దారిలో 'ఎవరు' సెకండ్ వీక్ పోస్టర్ వేయలేదని ప్రెస్ మీట్ లో భాదను వ్యక్తపరిచాడు. ఇదే వేడుకలో తనకి థ్రిల్లర్ స్టార్ అని మినిమం గ్యారెంటీ హీరో అనే బిరుదులేవి అక్కర్లేదని చనిపోయాక శేష్ మంచి సినిమాలు చేశాడ్రా  అనుకుంటే చాలని చెప్పుకున్నాడు.
    

Tags:    

Similar News