పెద‌వి తాంబూలం అంద‌నిదే నిదుర ప‌ట్టదా గురూ?

Update: 2022-11-03 14:46 GMT
అందం హిందోళం.. అద‌రం తాంబూళం! అంటూ వేటూరి లిరిక్ రాశారు.  కానీ అద‌ర తాంబూలం అందుకోవ‌డంలో  స్పెష‌లిస్టులు అన‌ద‌గ్గ హీరోలు మ‌న‌కు ఎంద‌రున్నారు? అంటే.. పెద‌వి ముద్దుల్లో పీ.హెచ్.డి లు చేసిన గురువులుగా లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్.. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ పేర్లు తొలిగా వినిపించేవి. ఆ త‌ర్వాత కాల‌క్ర‌మంలో సీరియ‌ల్ కిస్స‌ర్ గా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హ‌స్మి పేరు మార్మోగిపోయింది. అయితే ఆ ముగ్గురిని అనుక‌రించేందుకు కొంద‌రు యువ‌హీరోలు ప్ర‌య‌త్నించినా కానీ ఆశించిన రిజ‌ల్ట్ అయితే రాలేదు. అంత గుర్తింపు కూడా లేదు.

కానీ ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ యువ‌హీరో శేష్ పేరు ఈ జాబితాలోకి చేరింది. అత‌డు కిస్సు లేనిదే సినిమా చేయ‌డు. అందాల క‌థానాయిక‌తో పెద‌వి ముద్దుల‌కు అల‌వాటు ప‌డిపోయాడ‌న్న గుస‌గుస వేడెక్కిస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కూ డ‌జ‌ను సినిమాల్లో న‌టిస్తే ఇంచుమించు ప్ర‌తి సినిమాలోను అత‌డు పెద‌వి ముద్దుల‌తో వేడెక్కించాడు. ఇప్ప‌టికే హాట్ హీరోయిన్స్ ప్రియా బెన‌ర్జీ (కిస్)- అదాశ‌ర్మ (క్ష‌ణం)- శోభిత ధూళిపాల (గూఢ‌చారి)- సాయి మంజ్రేక‌ర్ (మేజ‌ర్) తో వ‌రుస‌గా లిప్ లాక్ లు వేసిన అత‌డు తాజా చిత్రం `హిట్ 2`లో కూడా మ‌రో హాట్ గాళ్ మీనాక్షి చౌద‌రితో ఘాడ‌మైన చుంబ‌నాల్లో మునిగి తేలాడు.

ట్రైల‌ర్ ఇన్ స్టంట్ గా హిట్ అయ్యింది అంటే ఈ పెద‌వి తాంబూలం పుణ్య‌మే. ఇక‌పోతే కేవ‌లం లిప్ లాక్ లు వేయ‌డంలోనే కాదు.. కంటెంట్ ని ఎంపిక చేసుకోవ‌డంలోను అత‌డి అభిరుచి అంద‌రికీ న‌చ్చుతోంది. మేజ‌ర్ చిత్రంతో పాన్ ఇండియ‌న్ స్టార్ గాను అద‌ర‌గొట్టాడు.

చాలా మంది న‌ట‌వార‌సులు ఇంకా కెరీర్ కోసం పాకులాడుతున్న ప‌రిశ్ర‌మ‌లో అత‌డు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా కేవ‌లం ఆల్ రౌండ‌ర్ నైపుణ్యం.. న‌ట‌ ప్ర‌తిభ‌తో అసాధార‌ణంగా రాణిస్తున్నాడు. ఇప్పుడు అత‌డు ఆడిందే ఆట‌.. పాడిందే పాట‌గా సాగుతోంది. నేటిత‌రంలో ఛాలెంజింగ్ హీరోగా శేష్‌ త‌న‌ని తాను తీర్చిదిద్దుకున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. న‌ట‌న‌కు వార‌స‌త్వ నేప‌థ్యం అవ‌స‌రం లేద‌ని కూడా అత‌డు నిరూపిస్తున్నాడు.

బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా- కార్తీక్ ఆర్య‌న్ విల‌క్ష‌ణ సినిమాల‌తో క‌మ‌ర్షియ‌ల్ హిట్లు అందుకుంటున్నారు. టాలీవుడ్ లో అలాంటి ప్ర‌తిభావంతుడిగా శేష్ కి గుర్తింపు ద‌క్కింది. ముఖ్యంగా ఇత‌ర హీరోల్లో లేని అరుదైన‌ ట్యాలెంట్ శేష్ కి  ఉంది. అత‌డిలోని ర‌చ‌యిత కం డైరెక్ట‌ర్ ప్ర‌తిసారీ ఛాలెంజింగ్ స్క్రిప్టుల ఎంపిక‌కు స‌హ‌క‌రిస్తున్నార‌న‌డంలో సందేహం లేదు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News