ఏడాదికో సినిమా... శేష్ ఫిక్స్ !

Update: 2019-08-22 01:30 GMT
క్వాలిటీ సినిమా ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు అడివి శేష్. ఆ విషయంలో ఏ మాత్రం తొందరపడడు. అదే అతనికి ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ తీసుకొచ్చింది. 'క్షణం' సినిమాకు హీరోగానే కాకుండా రైటింగ్ లోనూ పార్ట్ అయ్యాడు శేష్. అంతే కాదు తనకున్న టెక్నీకల్ పై ఉన్న అవగాహనతో హాలీవుడ్ స్టైల్ మేకింగ్ తో సినిమా చేస్తాడు. 'గూఢచారి'కి అదే కలిసొచ్చింది. సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందారు.

లేటెస్ట్ గా 'ఇన్విసిబుల్ గెస్ట్' అనే స్పానిష్ ఫిల్మ్ ను తెలుగులో 'ఎవరు' అనే టైటిల్ తో తీసి మళ్లీ సూపర్ హిట్టు కొట్టాడు థ్రిల్లర్ హీరో. ఈ సినిమాతో హీరోగా మరో మెట్టెక్కేసాడు శేష్. బడా నిర్మాతలు, స్టార్ హీరోలనుండి కూడా మంచి అభినందనలు అందుకున్నాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ఊపందుకుంటున్న కెరీర్ ను పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఏడాదికో సినిమా మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాడు.

శేష్ నెక్స్ట్ సినిమా 'మేజర్' కు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాను అక్టోబర్ లి సెట్స్ పైకి తీసుకొస్తాడు శేష్. మహేష్ బాబు  - సోనీ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాకే గూఢచారి సీక్వెల్ ను స్టార్ట్ చేస్తాడు శేష్. ఆ సినిమా 2021 లో రిలీజ్ చేస్తారు. ఇలా వరుసగా క్వాలిటీ సినిమాలతో ఏడాదికోసారి మాత్రమే ప్రేక్షకులను పలకరించబోతున్నాడు శేష్.
    

Tags:    

Similar News