సాహో టికెట్స్ కావాలన్న గూఢచారి

Update: 2019-06-05 03:48 GMT
యువి సంస్థ ఇంకా విస్తృత స్థాయిలో ప్రమోషన్ మొదలుపెట్టనప్పటికీ సాహో తాలూకు వైబ్రేషన్స్ అభిమానుల్లో అప్పుడే ఓ  రేంజ్ లో ఉన్నాయి. విడుదలకు డెబ్బై రోజులే ఉన్న తరుణంలో పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ ఖచ్చితంగా బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడుతుందని చాలా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు సాహోకు ఓపెనింగ్స్ చాలా కీలకంగా మారుతున్నాయి.

టాలీవుడ్ లో ఏ తెలుగు సినిమా దక్కించుకొని భారీ విడుదలతో పాటు కనివిని ఎరుగని స్థాయిలో మొదటి రోజు వసూళ్లు రాబడితేనే ముందు ముందు సేఫ్ రన్ సాధ్యమవుతుంది. దీని మీద ఉన్న బజ్ కి అది జరగడం పెద్ద కష్టమేమి కాదు కాని దాన్ని ఇంకాస్త పెంచాల్సిన అవసరం చాలా ఉంది. ఫ్యాన్స్ అనే కాదు సామాన్య ప్రేక్షకుల్లో సైతం దీని మీద విపరీతమైన ఆసక్తి నెలకొంది

దీనికి సెలబ్రిటీలు సైతం మినహాయింపు కాదు. గూడచారి హీరో అడవి శేష్ సాహో ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే తీరతానని ప్రకటించేశాడు. అతనే కాదు లెండి దాదాపు అందరి మనసులో ఉన్న మాటే ఇది. అయితే శేష్ కు సాహో రిజల్ట్ తో కనెక్షన్ ఉంది. కేవలం వారం గ్యాప్ లో ఆగష్టు 23న తన ఎవరుని రిలీజ్ చేస్తున్నాడు. మొన్నే ప్రకటన కూడా ఇచ్చేశారు.

రెజినా హీరొయిన్ గా నటిస్తున్న ఈ థ్రిల్లర్ ని అంత షార్ట్ స్పాన్ లో విడుదల చేయడం అంటే సాహసమే. ఎందుకంటే సాహో తాలుకు ప్రకంపనలు ఎంత లేదన్నా మూడు వారాలు అయినా ఉంటాయి. మరి ఎవరు ఏడు రోజుల వ్యవధిలో వచ్చేస్తే అది సవాల్ గానే ఉంటుంది. శేష్ సగటు ప్రేక్షకుడిగా సాహో చూడాలని చెబుతున్నా తన ఎవరు మీద ఎంత మేరకు ఇంపాక్ట్ ఉంటుందన్న క్యాలికులేషన్ కూడా మనసులో ఉండే ఉంటుందిగా


Tags:    

Similar News