వాట‌ర్ బేబి సితార విన్యాసాలు చూడ‌త‌ర‌మా?

Update: 2022-04-11 15:06 GMT
సూపర్ స్టార్ మహేష్  - న‌మ్ర‌త జంట గారాల‌ప‌ట్టీ సితార గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. డాడ్ మ‌హేష్ కి ధీటుగా ఫాలోయింగ్ పెంచుకుంటోంది సితార‌. ఇప్ప‌టికే సామాజిక మాధ్య‌మాల్లో బోలెడంత పాపులారిటీ వ‌చ్చేసింది. సీతా పాప‌ అందమైన ఫోటోషూట్ లు.. స్టైల్ కంటెంట్ .. డ్యాన్సింగ్ వీడియోలు ఇంత‌కుముందు వైర‌ల్ గా దూసుకెళ్లాయి. సర్కారు వారి పాటలోని సాంగ్స్ కి సీతా పాప డ్యాన్సులు చేస్తూ బోలెడంత ప్ర‌చారం చేసేస్తోంది.

ఇక సితార హ్యాబిట్స్ విష‌యానికి వ‌స్తే త‌న‌కు వాట‌ర్ బేబీగా ఉండ‌డం అంటే చాలా ఇష్టం. ఇంత‌కుముందు దుబాయ్ టూర్ లో అండ‌ర్ వాట‌ర్ విన్యాసాల‌తో మ‌ర‌బోట్ షికార్ తో బోలెడంత సంద‌డి చేసింది. ఇప్పుడు నీటి అడుగున ఈత కొడుతూ షాకిస్తోంది. రెండ్రోజుల క్రితం ఆమె చేసిన కూచిపూడి డ్యాన్స్ ఇప్పటికే ఆమె తల్లిదండ్రులను గర్వపడేలా చేసింది.

తాజాగా సితార ఈతలో మేటి అని నిరూపిస్తూ ఓ వీడియోని షేర్ చేసింది. ఇది వైర‌ల్ గా దూసుకెళుతోంది. ఇక ఈ ఫోటోల్లో సితార నీటి అడుగున‌ శ్వాసను బంధించే కళను నేర్చుకుంటున్నట్లు రాసింది. ``నీళ్ల కింద ఊపిరి పీల్చుకోవడం కష్టమే.. కానీ మిమ్మల్ని మంచి ఈతగాడుగా చేస్తుంది!!`` అని వ్యాఖ్య‌ను జోడించింది.

సితార ఏం చేసినా త‌న టీచ‌ర్లు కోచ్ ల మార్గ‌ద‌ర్శ‌నంలోనే చేస్తుంది.అన‌వ‌స‌ర‌మైన సాహ‌సాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌దు. తాజా ఫోటోషూట్ కి నమ్రతా శిరోద్కర్ - ఆమె సోదరి శిల్పా ముగ్ధులైపోయారు. క‌చ్చితంగా సితార ట్రెండ్స్ ని మించి అడ్వాన్స్ డ్ గా వెళుతోంది. తనదైన యూనిక్ జీవన శైలితో ఆక‌ట్టుకుంటోంది అని ప్ర‌శంసించారు. అన్న‌ట్టు సితార న‌టిగా ఎప్పుడు డెబ్యూ ఇస్తుందో  చూడాల‌న్న ఆసక్తి అభిమానుల‌కు ఉంది.
Tags:    

Similar News