సైమా ఈ రహస్యం చెప్మా!!

Update: 2018-09-14 12:30 GMT
ఇప్పుడంటే చాలా సంస్థలు సినిమాలకు టీవీ షోలకు పోటీ పడి అవార్డులు ఇస్తున్నాయి కానీ ఒకప్పుడు నంది-ఫిలిం ఫేర్ అంటూ గుర్తింపు పొందినవి చాలా తక్కువగా ఉండేవి. ఇప్పుడు ఎన్ని ఉన్నా కొన్నింటికి మాత్రం ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో ఒకటి సైమా. అవార్డులు ఎవరికి ఇస్తున్నారు అనే దాని కంటే దానికి తరలివచ్చే తారాలోకాన్ని చూసేందుకు ఎదురు చూసే ప్రేక్షకులే ఎక్కువగా ఉంటారు. అసలు సైమా వెనుక ఎవరు ఉన్నారు ఎలా అవార్డులు ఇస్తున్నారు అనేదాన్ని కాసేపు పక్కన పెడితే ఇప్పుడు ప్రకటించిన అవార్డుల వెనుక మాత్రం ఒక చిదంబర రహస్యం కనిపిస్తోంది. ఈ ఏడాది విన్నర్స్ లిస్ట్ లో కీరవాణి-సింగర్ కాలభైరవ-రానా ముగ్గురికి చోటు దక్కింది. రానాకు మోస్ట్ ఎంటర్ టైనర్ ట్యాగ్ కింద బాహుబలి-ఘాజీ-నేనే రాజు నేనే మంత్రికి కలిపి ఇస్తున్నారు. వీళ్ళు ఎన్టీఆర్ బయోపిక్ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నవాళ్లు. దానికి సంగీత దర్శకుడు కీరవాణి కాగా గాయకుడు కాలభైరవ ఓ రెండు పాటలు పాడినట్టు సమాచారం. రానా నారాగా నటిస్తున్నాడు. ఇదంతా ఎందుకు అనేగా మీ డౌట్. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతల్లో సైమా నిర్వాహకులు ఉన్నారు. కాబట్టే ఇలా ఇచ్చారనే టాక్ వచ్చేసింది.

కథ ఇక్కడితో అయిపోలేదు.వీళ్లకు ఇచ్చి బాలయ్యకు ఇవ్వకపోతే బాగుండదు అనుకున్నారో ఏమో కానీ బెస్ట్ యాక్టర్ బై క్రిటిక్స్ అంటూ స్పెషల్ అవార్డు ప్రకటించేసారు. గౌతమి పుత్ర శాతకర్ణికి గాను క్రిటిక్స్ ను మెప్పించినందుకు ఫలితమట. అంతే కాదు బెస్ట్ మూవీ బై క్రిటిక్స్ అంటూ దానికి మరో అవార్డు కూడా ఇచ్చేసారు. ఈ మొత్తం క్రమాన్ని గమనిస్తే గంపగుత్తగా ఎన్టీఆర్ సినిమాలో నటిస్తున్న పనిచేస్తున్నవారికే కోరిమరీ ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. అంటే వచ్చే ఏడాది విడుదలయ్యే ఎన్టీఆర్ కు ఆ తర్వాత సైమా అవార్డ్స్ లో సింహ భాగం దక్కుతుందని ఇప్పటికే కామెంట్స్ మొదలైపోయాయి. ఇలా తమకు అనుకూలంగానో లేదా అస్మదీయులకు అవార్డులు ఇవ్వడం కామనే కానీ ఈ లింక్ గురించి మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల తరహాలో ముందస్తు అవార్డులు ఫిక్స్ చేస్తున్నట్టు ఉన్నారే అనే మాట కూడా వస్తోంది. ఆ మధ్య నంది  అవార్డులు లెజెండ్ కు ఇచ్చినప్పుడు పెద్ద రచ్చే జరిగింది. ప్రభుత్వం తరఫున ఇచ్చేవి కాబట్టి బాగానే గొడవైంది కానీ ప్రైవేట్ గా జరిగే వాటి మీద అంత ప్రభావం ఉండదు కాబట్టి సైమాకు అలాంటి చిక్కేమి రాదు. కాకపోతే ఈ రహస్యం తాలూకు గుట్టు మాత్రం వాళ్ళకే తెలుసు.
Tags:    

Similar News