బ్లఫ్ మాస్టర్.. ఈ సినిమా గురించి మొదట్లో అనౌన్స్ చేసినపుడు.. ఆ తర్వాత చిత్రీకరణ సమయంలో పెద్దగా హైప్ లేదు. సత్యదేవ్ హీరో అనగానే జనాలకు పెద్దగా ఆసక్తి కలగలేదు. కానీ ఈ సినిమా టీజర్.. ట్రైలర్ వచ్చాక కథ మారింది. ఇది బలమైన కంటెంట్ ఉన్న సినిమాలాగే కనిపించింది. ముఖ్యంగా కాన్సెప్ట్.. హీరో క్యారెక్టరైజేషన్.. డైలాగ్స్ ఆసక్తి రేకెత్తించాయి. సత్యదేవ్ స్క్రీన్ ప్రెజెన్స్.. యాక్టింగ్.. డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. నెమ్మదిగా సినిమాకు బజ్ వచ్చింది. పైగా మంచి టైమింగ్ లో సినిమాను రిలీజ్ చేయడం కలిసొస్తోంది. క్రిస్మస్ వీకెండ్లో వచ్చిన సినిమాల్లో మెజారిటీ ఫెయిలయ్యాయి.
‘కేజీఎఫ్’ ఆడుతోంది కానీ.. వచ్చే వారాంతం సమయానికి వీక్ అవ్వొచ్చు. తర్వాత సంక్రాంతి సినిమాకు ముందు పది రోజుల ఖాళీ ఉంది. ఇలాంటి సమయంలో పెద్దగా పోటీ లేకుండా వస్తోంది ‘బ్లఫ్ మాస్టర్’. సినిమాకు మంచి టాక్ వస్తే అంచనాల్ని మించి విజయం సాధించే అవకాశముంది. దిల్ రాజు.. అల్లు అరవింద్.. దగ్గుబాటి సురేష్ లాంటి అగ్ర నిర్మాతలు ఈ సినిమాను నమ్మి డిస్ట్రిబ్యూట్ చేస్తుండటాన్ని బట్టే ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తోంది. మరి ‘బ్లఫ్ మాస్టర్’ ఇండస్ట్రీకి స్వీట్ షాక్ ఇస్తుందేమో చూద్దాం. ఇంతకుముందు ‘రోమియో’ సినిమా తీసిన గోపీ గణేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తమిళంలో హిట్టయిన ‘శతురంగ వేట్టై’కి ఇది రీమేక్. సత్యదేవ్ సరసన నందిత శ్వేత కథానాయికగా నటించింది. రమేష్ పిళ్లై ఈ చిత్రాన్ని నిర్మించాడు.