బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మహేష్ బాబు 'భరత్ అనే నేను' సినిమాతో సౌత్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సౌత్ లో మొదటి సినిమా హిట్ కావడంతో రెండో సినిమా కూడా చరణ్-బోయపాటి ప్రాజెక్ట్ రూపంలో ఒక జాక్ పాట్ లా తగిలింది. అంతటితో స్టోరీ అయిపోలేదు.. చరణ్ సినిమా రిలీజ్ కు ముందే 'లస్ట్ స్టోరీస్' ఘాటు వెబ్ సీరీస్ లో నటించి సోషల్ మీడియా హీటును అమాంతం పెంచింది. ఆ హీట్ కోలీవుడ్ కి కూడా తగిలిందేమో మరి మరో క్రేజీ ఆఫర్ వచ్చి ఈ అమ్మడి బుట్టలో పడింది.
తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో సినిమా చేస్తాడట. ఇప్పటికే విజయ్ అట్లీ చెప్పిన ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ కు పచ్చ జెండా ఊపాడట. దీంతో ఒకవైపు స్క్రిప్ట్ ఫైన్ ట్యూనింగ్ చేస్తూ క్యాస్టింగ్ - టెక్నిషియన్స్ ఎంపికలో బిజీగా ఉన్నాడు అట్లీ. ఈ సినిమాలో హీరోయిన్ గా కియారా ను ఫైనలైజ్ చేసుకున్నాడట. కియరాను ఆల్రెడీ అప్రోచ్ కావడం కూడా జరిగిందట. విజయ్ లాంటి టాప్ స్టార్ ప్రాజెక్ట్ కాబట్టి 'నో' చెప్పే అవకాశం లేదని కోలీవుడ్ టాక్.. పైగా రెమ్యునరేషన్ కూడా భారీగా నే ముట్టజెప్తారు కాబట్టి విజయ్ తో కియారా జోడీ కట్టడం పక్కానే.
చూస్తుంటే ఈ బ్యూటీ ఓ వైపు ఇన్నోసెంట్ అమ్మాయి రోల్స్ తో పాటు, లస్ట్ స్టోరీస్ వంటి ఘాటు పాత్రల్లో కూడా రాణిస్తూ అటు ముంబై.. ఇటు హైదరాబాద్... ఆ పక్కన చెన్నై అన్నీ ఇండస్ట్రీలకు సమన్యాయం చేస్తోంది. ఫ్యూచర్ లో నేషనల్ ఐకాన్ లా మారుతుందేమో.