సొంత బ్రేకప్‌ గుర్తొచ్చిందా బాసూ??

Update: 2015-10-28 19:30 GMT

Full View
బాలీవుడ్ లో పలు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు సెట్స్ పై ఉన్నాయి కానీ.. ఓ మూవీ మాత్రం బాలీవుడ్ లో చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. అదే రణబీర్ కపూర్ - దీపికా పదుకొణే కలిసి నటించిన 'తమాషా'. మాజీ లవర్స్ అయిన వీరిద్దరూ కలిసి నటించడానికి ఒప్పుకున్నపుడే కాంబినేషన్ పై అంచనాలు పెరిగిపోయాయి. పిక్చరైజేషన్ టైంలో వీళ్లిద్దరి కెమిస్ట్రీ చూసి యూనిట్ కి మతిపోతే.. ట్రైలర్ లో వీళ్ల దగ్గరితనం, యాక్టింగ్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు.

ప్రేమికుల జంటగా అంతగా ఒదిగిపోయారు రణబీర్ దీపికలు. అయితే ఈ మూవీలో ప్రేమికులిద్దరూ బ్రేకప్ అయ్యే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఈ సీన్ కోసం ప్రత్యేకంగా సిట్యుయేషన్ సీన్ కూడా సెట్ చేశాడు డైరెక్టర్. 'అగర్ తుమ్ సాథ్ హో' అంటూ సాగే ఈ సాంగ్ చాలా క్యాచీగానే కాదు.. మనసులు హత్తుకునేలా ఉంది. ఈ పాటను చాలా వరకూ క్లోజప్ షాట్స్ పైనే తీయడం విశేషం. కేవలం హావభావాలపైనే సాంగ్ నడిపించేశారు. ఈ సాంగ్ ని రీసెంట్ గా యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

మాజీ ప్రేమికులైన వీళ్లిద్దరూ నిజంగానే విడిపోయారు. ఇప్పుడదే సీన్ ని తెరపై కూడా పండించాల్సి వచ్చింది. నిజానికి ఇలాంటి సిట్యుయేషన్ ని ఫేస్ చేయాల్సి రావడం ఇబ్బందికరంగా ఉంటుంది ఎవరికైనా. కానీ రణబీర్, దీపికలు మాత్రం పాత్రల్లో ఒదిగిపోయి, ఏది నిజమో, ఏది సినిమానో అర్ధం కానంతగా జీవించేశారు పాత్రల్లో. మొదటి నుంచి సెంటిమెంట్ పండించే వంతు దీపిక దైతే.. నిర్లక్షంగా ఆమెని పట్టించుకోనట్లుగా రణబీర్ కపూర్ చేశాడు. ఇద్దరూ పలికించిన ఎమోషన్స్ కి ప్రేక్షకులు హ్యాట్సాఫ్ అంటున్నారు. చూస్తుంటే.. మాజీ లవర్స్ తమ బ్రేకప్‌ ను గుర్తు తెచ్చుకొని నటించేసునట్లున్నారే.
Tags:    

Similar News