సరైన సినిమాలు పడక ప్రేక్షకులు ఫ్రస్టేషన్లో ఉన్నపుడు ఓ మాంచి సినిమా పడితే దాని రేంజే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ‘రంగస్థలం’ ఆ రకంగానే బాక్సాఫీస్ ను ఏలుతోంది. కొత్త ఏడాది మొదలై మూడు నెలలవుతున్నా.. ప్రేక్షకులు ఆశించే భారీ సినిమా సందడి లేకపోయింది. గత కొన్నేళ్లుగా సంక్రాంతి సినిమాలు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తూ వస్తున్నాయి. ఆ సీజన్లో వచ్చే సినిమాలతో ప్రేక్షకులకు కడుపు బాగానే నిండుతూ వస్తోంది. కానీ ఈ ఏడాది మాత్రం కథ తిరగబడింది. సంక్రాంతి సినిమాలు తీవ్ర నిరాశకు గురి చేశాయి. ముఖ్యంగా ‘అజ్ఞాతవాసి’ ప్రేక్షకులకు పెద్ద షాకే. ఆ షాక్ నుంచి కోలుకునేలా ఏ సినిమా చేయలేకపోయింది. తర్వాతి వారాల్లో హిట్లు లేవని కాదు కానీ.. సగటు ప్రేక్షకుడు ఆశించే ‘భారీ’ వినోదం మాత్రం లేకపోయింది. అందులోనూ గత నెల రోజుల్లో బాక్సాఫీస్ బాగా డల్లయిపోయింది.
ఎంతైనా ఒక పెద్ద సినిమా వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్ల దగ్గర సందడే వేరుగా ఉంటుంది. ఆ సందడే తెచ్చింది ‘రంగస్థలం’. ‘అజ్ఞాతవాసి’ మెగా అభిమానుల్నే కాదు.. సగటు ప్రేక్షకుడికీ నిరాశ మిగిల్చింది. ఆడియన్స్ అందరూ అప్పట్నుంచి ఓ మాంచి పెద్ద సినిమా కోసం ఆవురావురుమని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ‘రంగస్థలం’ వచ్చి రచ్చ చేసింది. ఈ చిత్రానికి మరీ గొప్ప టాక్ ఏమీ రాలేదు. అయినప్పటికీ ప్రేక్షకులున్న ఆకలిలో ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టేస్తున్నారు. వీకెండ్ అంతా వసూళ్ల మోత మోగించిన ‘రంగస్థలం’.. సోమవారం కూడా స్టడీగానే సాగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు. ఈ చిత్రం ఫుల్ రన్లో నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టే అవకాశాలున్నాయి.