'ఆహా' వాడకం అంటే ఇదే బాసు..!

Update: 2022-10-27 15:30 GMT
కన్నడ నుంచి మరో టాలెంటెడ్ హీరో కమ్ డైరక్టర్ టాలీవుడ్ కి పరిచయం అయ్యాడు. ఇటీవల వచ్చిన కాంతార సినిమాతో రిషబ్ శెట్టి పేరు దేశమంతా మారుమ్రోగుతుంది. నటుడిగానే కాదు రైటర్, డైరక్టర్ గా అతని కెపాసిటీకి హ్యాట్సాఫ్ అనేస్తున్నారు. రిషబ్ శెట్టి చేసిన కాంతార సినిమాని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తెలుగులో రిలీజ్ చేశారు.

ఈ సినిమాని ఆయన 2 కోట్లకు కొనగా ప్రస్తుతం తెలుగు బాక్సాఫీస్ దగ్గర కాంతార 20 కోట్ల పైగా కలెక్ట్ చేసింది. ఇప్పటికీ కాంతార వసూళ్లు బాగానే ఉన్నాయి. కాంతార తెలుగులో ఈ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకోవడం మేకర్స్ ని కూడా ఆశ్చర్యపరచింది. సినిమాతో తన సత్తా చాటిన రిషబ్ శెట్టికి అల్లు అరవింద్ మెగా ఆఫర్ ఇచ్చారు.    

త్వరలోనే రిషబ్ తో ఓ సినిమా చేస్తానని ప్రకటించారు. అదేకాకుండా రిషబ్ శెట్టి నటించిన, డైరెక్ట్ చేసిన సినిమాలతో కూడా అల్లు అరవింద్ డీల్ కుదుర్చుకున్నారట. ఆహాలో రిషబ్ శెట్టి సూపర్ హిట్ సినిమాలు రిలీజ్ చేసేలా ఒప్పందం ఏర్పరచుకున్నారట. దీని కోసం ఆ హీరోకి బాగానే ముట్టచెబుతున్నట్టు తెలుస్తుంది.

ఆహా ఓటీటీలో ఇప్పటికే కన్నడ సినిమాలు చాలా వరకు డబ్ అయ్యాయి. రిషబ్ శెట్టి నటించిన బెల్ బాటం కూడా రిలీజై సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు రిషబ్ నటించిన, డైరెక్ట్ చేసిన అన్ని సినిమాలు ఒకేసారి డీల్ సెట్ చేసుకుంటున్నారట.  

రిషబ్ శెట్టి నటించిన సూపర్ హిట్ మూవీ గరుడ గమన వృషభ వాహన.. హరికథే అల్ల గిరికథే సినిమాలు డబ్ చేసి ఆహా లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఇంకా రిషబ్ శెట్టి తీస్తున్న శివమ్మ సినిమాను తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేసేలా కూడా డిస్కస్ చేశారట. శివమ్మ సినిమాని రిషబ్ శెట్టి నిర్మిస్తున్నారు.

రిషబ్ ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీ.. అంతగోని శెట్టి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు కూడా డైరెక్ట్ గా తెలుగులో కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కాంతార తో తెలుగు ఆడియన్స్ లో క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి ఇక మీదట తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. థియేట్రికల్ రిలీజ్ ఎలా ఉన్నా రిషబ్ శెట్టి సినిమాలు మాత్రం ఆహాలో పక్కా వస్తాయని మాత్రం చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News