ఇంకా బూతు కంటెంట్‌ నే నమ్ముకున్న ఆహా?

Update: 2020-08-17 23:30 GMT
భవిష్యత్తు అంతా ఓటీటీదే అనే దూరపు ఆలోచనతో మెగా నిర్మాత అల్లు అరవింద్‌ ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ ను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ అన్నీ కూడా అన్ని భాషలకు చెందిన కంటెంట్‌ ను అందిస్తున్నాయి. కాని ఆహా మాత్రం కేవలం తెలుగు కంటెంట్‌ ను మాత్రమే కలిగి ఉంటుందని తెలుగు ప్రేక్షకుల కోసం ఎక్స్‌ క్లూజివ్‌ గా రూపొందించాం అంటూ అల్లు అరవింద్‌ ప్రకటించాడు. ఆయన ఆహా ప్రారంభం రోజే కొన్ని కథలను బూతు కంటెంట్‌ తో చూపిస్తేనే అవి జనాలకు ఎక్కుతాయి అంటూ ఆహాలో అడల్ట్‌ కంటెంట్‌ భారీగానే ఉండబోతుందని ఆయన హింట్‌ ఇచ్చాడు. అన్నట్లుగానే బోల్డ్‌ కంటెంట్‌ తోనే నింపేశారు.

ఆహాలో మొదటి వెబ్‌ సిరీస్‌ ల నుండి మొన్న వచ్చిన మెట్రో కథలు వెబ్‌ మూవీ వరకు అడల్ట్‌ కంటెంట్‌ ను కలిగి ఉన్నాయి. ఏ షో చూసినా కూడా బూతు కంటెంట్‌ ఉండటంతో ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఆహాకు కనెక్ట్‌ అవ్వలేక పోతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ తో పాటు అన్ని వర్గాల వారిని తెర ముందు కూర్చోబెట్టినప్పుడు మాత్రమే ఆహా సక్సెస్‌ అయ్యింది. కాని కంటెంట్‌ విషయంలో సౌత్‌ ఇండియన్స్‌ అభిరుచికి తగ్గట్లుగా కాకుండా నార్త్‌ ఇండియన్స్‌ అభిరుచికి తగ్గట్లుగా ఉందంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సౌత్‌ ఆడియన్స్‌ ను కట్టిపడేసే వెబ్‌ సిరీస్‌ ఇప్పటి వరకు ఏది కూడా ఆహాలో స్ట్రీమింగ్‌ అవ్వలేదు అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైతే ఆహా కంటెంట్‌ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటుందో అప్పుడే ఆహా సక్సెస్‌ అవుతుంది. మొదట్లో బూతు కంటెంట్‌ పెట్టినా విమర్శలు రావడంతో రూటు మార్చుతారని అనుకుంటే ఇంకా కూడా బూతు కంటెంట్‌ వెనకాలే పడుతున్నారు అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Tags:    

Similar News