ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ తాజాగా మొట్ట మొదటి తెలుగు ఆంథాలజీ సిరీస్ 'పిట్ట కథలు' రిలీజ్ కి రెడీ చేసిన సంగతి తెలిసిందే. నాలుగు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్ కి నలుగురు ప్రతిభావంతులైన దర్శకులు నాగ్ అశ్విన్ - బి.వి.నందిని రెడ్డి - తరుణ్ భాస్కర్ - సంకల్ప్ రెడ్డి వర్క్ చేశారు. 'పిట్టకథలు' ఆంథాలజీని 190 దేశాలలో నెట్ ప్లిక్స్ లో ఫిబవరి 19 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ప్రకటిస్తూ దీనికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసారు. ఒకవేళ మీకు తెలుగులో బ్రష్ అప్ చేయడానికి ఒక కారణం అవసరమైతే అంటూ 'నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ త్వరలో మీ ముందుకు' అని ట్వీట్ చేశారు.
అయితే 'నెట్ ఫ్లిక్స్' ప్రమోషనల్ స్ట్రాటజీపై తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా' సెటైర్ వేస్తూ ట్వీట్ పెట్టింది. నెట్ ఫ్లిక్స్ చేసిన ట్వీట్ కి కౌంటర్ గా 'మనది ఎలాగూ 100% తెలుగు నే కదా.. ఇక బ్రషింగ్ లు అవసరం లేదు!' అంటూ ట్వీట్ పెట్టింది ఆహా టీమ్. దీనికి 'మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. అరుస్తున్నామా?' అంటూ ఓ ఇమేజ్ ని జత చేసింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ కి పోటీగా 100శాతం తెలుగు ఓటీటీ అంటూ అడుగుపెట్టిన 'ఆహా' వాటికి ధీటుగా నిలబడే ప్రయత్నం చేస్తూ వస్తోంది. సినిమాలు - వెబ్ సిరీస్ లతో పాటు స్పెషల్ షో లను కూడా స్ట్రీమింగ్ కి పెడుతూ వీక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సబ్ స్క్రైబెర్స్ పెంచుకుంటూ వస్తోంది.