ఆహా వారి అన్యాస్ లేడీస్ ట్యూటోరియల్‌

Update: 2021-07-17 10:30 GMT
తెలుగు స్పెషల్‌ ఓటీటీ కంటెంట్‌ విషయంలో మొదట్లో విమర్శలు ఎదుర్కొంది. ఇప్పటికి కూడా కొందరు డబ్బింగ్‌ సినిమాలోనే ఓటీటీని నడుపుతున్నారు అంటూ విమర్శలు చేస్తున్నారు. కొందరు మాత్రం డబ్బింగ్‌ సినిమాలు అయినా మంచి కంటెంట్‌ ఉన్న సినిమాలను తీసుకు వస్తున్నందుకు అభినందనీయం అంటున్నారు. మొత్తానికి ఆహా తెలుగు ఓటీటీ జనాల్లో మంచి పేరును అయితే దక్కించుకుని ఖాతాదారుల సంఖ్య ను పెంచుకుంటూ పోతుంది. ఈ సమయంలో అల్లు అరవింద్‌ అండ్ టీమ్ మరింతగా కంటెంట్‌ విషయంలో దృష్టి పెడుతున్నారు. భారీ చిత్రాల జోలికి వెళ్లకుండా చిన్న సినిమాలను మరియు వెబ్‌ సిరీస్ లను తీసుకుంటూ తమ ఖాతాదారులకు మంచి కంటెంట్‌ ను అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల స్ట్రీమింగ్ మొదలు అయిన కుడి ఎడమైతే వెబ్‌ సిరీస్ కు విమర్శకుల నుండి ప్రశ్నంసలు దక్కుతున్నాయి. ఈ సమయంలోనే మరో వెబ్‌ సిరీస్ ను ఆహా స్ట్రీమింగ్ కు సిద్దం చేయబోతుంది.

బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా వారు 'అన్యాస్ ట్యూటోరియల్‌' అనే వెబ్‌ సిరీస్ ను నిర్మించడం జరిగింది. రెజీనా ప్రత్యేక పాత్రలో నటించిన ఈ వెబ్‌ సిరీస్‌ ప్రత్యేకత ఏంటీ అంటే దర్శకురాలు.. రచయిత తో పాటు పలు విభాగాల్లో ఆడవారు వర్క్ చేశారు. ఈ సినిమా పూర్తిగా మహిళ ప్రధానంగా సాగుతూ ఉంటుంది. రెజీనా మొదటి సారి వెబ్‌ సిరీస్ లో నటించడంతో పాటు ఆకట్టుకునే రీతిలో ఈ వెబ్‌ సిరీస్‌ లో ఆమె లుక్‌ ఉంటుందని అంటున్నారు. ఆహా వారు భారీ మొత్తంను చెల్లించి ఈ వెబ్‌ సిరీస్ ను ఆర్కా వారి నుండి కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ వెబ్‌ సిరీస్ ను ఆహా లో స్ట్రీమింగ్‌ చేస్తే ఎక్కువ మందికి చేరువ చేయవచ్చు అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా శోభు యార్లగడ్డ చెప్పుకొచ్చారు. ఈ వెబ్‌ సిరీస్ ఒక ప్రత్యేకమైన కాన్సెప్ట్‌ తో సాగుతుందని.. మహిళ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. అల్లు అరవింద్‌ మాట్లడుతూ ఆహా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ ఉన్న వెబ్ సిరీస్ రాబోతుంది అన్నాడు. ఈ వెబ్‌ సిరీస్ లో రెజీనాతో పాటు కీలక పాత్రలో నివేద నటిస్తుండగా పల్లవి గంగిరెడ్డి దర్శకత్వం వహించారు. శౌమ్య శర్మ ఈ వెబ్‌ సిరీస్‌ కు రచన సహకారం అందించారు.

మొత్తంగా లేడీస్ స్పెషల్‌ వెబ్‌ సిరీస్ గా అన్యాస్ ట్యూటోరియల్ వెబ్‌ సిరీస్ సాగుతోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా వెబ్‌ సిరీస్ ఉంటుందనే అభిప్రాయంను యూనిట్‌ సభ్యులు వ్యక్తం చేశారు. బాహుబలి నిర్మాతలు అవ్వడంతో పాటు రెజీనాకు మంచి క్రేజ్ ఉండటం వల్ల ఈ వెబ్‌ సిరీస్ తప్పకుండా ప్రేక్షకుల్లో మంచి ఆధరణ దక్కించుకుంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తమిళంలో ప్రస్తుతం రెజీనా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండి మంచి క్రేజ్‌ను దక్కించుకుంది. అందుకే ఈ వెబ్‌ సిరీస్‌ ను తమిళంకు తీసుకు వెళ్లేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నాట. ఆ విషయమై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 
Tags:    

Similar News