బిగి స‌డ‌ల‌ని ప‌రువాలు బ‌ట్ట‌బ‌య‌లు

Update: 2021-12-17 11:30 GMT
అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు! అంటూ మెగా బాస్ అదిరే స్టెప్పులేశారు. ఇప్పుడు యూత్ ఈ అమ్మ‌డి అంద‌చందాల‌కు ముగ్ధులైపోవ‌డ‌మే కాదు లెట్స్ డు కుమ్ముడు అంటూ వెంట‌ప‌డ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఇంత‌కీ ఎవ‌రీ అమ్మ‌డు? అంటే.. ముంబై ప‌రిశ్ర‌మ‌లో పెద్ద కెరీర్ ని ఆశిస్తున్న శ‌ర్మా గాళ్ ఐషా శ‌ర్మ‌.

చిరుత బ్యూటీ నేహా శ‌ర్మ సోద‌రి ఐషా అన్న సంగ‌తి తెలిసిందే. మోడ‌ల్ గా రాణిస్తూనే న‌టిగా ఎదిగేందుకు ఐషాశ‌ర్మ తీవ్ర ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇటీవ‌లే జాన్ అబ్ర‌హాం స‌త్య‌మేవ జ‌య‌తేలో క‌నిపించింది. త‌దుప‌రి కొన్ని క‌థ‌లు విని ఓకే చెప్పేందుకు సిద్ధంగా ఉందిట‌. ఇంత‌లోనే సోష‌ల్ మీడియాల్ని ఒక రేంజులో ఊపేస్తోంది శ‌ర్మా గాళ్.

ఇదిగో ఇలా త‌న‌లోని అథ్లెటైజ‌ర్ ని బ‌య‌ట‌కి తీస్తూ ఒక రేంజులో చెల‌రేగిపోయింది. అలా ఎల్లో టాప్ బ్లాక్ ట్రాక్ ఫ్యాంట్ లో ఎంతో హాట్ గా క‌నిపిస్తోంది ఐషా శ‌ర్మ‌. జాగ్ర‌త్త‌గా ప‌రిశీలిస్తే ఇది బ్రాండ్ ప‌బ్లిసిటీ అన్న‌ది గ‌మ‌నించ‌వ‌చ్చు.

పాపుల‌ర్ క్లాథింగ్ బ్రాండ్ లివ్ ఎన్ కూల్ కి ప్ర‌చారం చేస్తోంది ఐషా శ‌ర్మ‌. ఇన్ స్టాలో ల‌క్ష‌లాది ఫాలోవ‌ర్స్ ని క‌లిగి ఉన్న ఈ బ్యూటీ ల‌క్ష‌ల్లో ఈ ప్ర‌చారానికి దండుకుంటోంది. ఇటీవ‌ల త‌న సోద‌రి నేహా శ‌ర్మ‌తో క‌లిసి ప‌లు ర‌కాల జాయింట్ వెంచ‌ర్ల‌కు ప‌ని చేస్తోంది. వ‌రుస వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో సిస్ట‌ర్స్ ఆదాయం అమాంతం పెరిగింద‌ని అర్థ‌మ‌వుతోంది.


Tags:    

Similar News