ఐశ్వర్యకు నచ్చిన బెస్ట్ రజనీ జోక్

Update: 2016-12-12 05:46 GMT
ఇంటర్నెట్ లో రజినీకాంత్ పై బోలెడన్ని జోకులు వస్తూ ఉంటాయి. రజినీని సూపర్ హీరోలకే సూపర్ హీరోను చేస్తూ బోలెడన్ని జోకులు వచ్చేస్తుంటాయి. ఇలాంటివాటికి రజినీ ఎలా స్పందిస్తారనే సందేహం సహజమే. ఈ ప్రశ్నకు రజినీకాంత్ కూతురు ఐశ్వర్య నుంచి సమాధానం ఇచ్చింది.

తాజాగా ఈ ఇంగ్లీష్ డైలీకి ఇంటర్వ్యూకి ఇచ్చిన ఐశ్వర్య.. కొత్త అవతారంతో కనిపించింది. స్లిమ్ గా మారిపోయిన లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అదే సమయంలో తన తండ్రితో అనుబంధాన్ని పంచుకున్న ఆమె.. నెట్ లో తన తండ్రిపై వచ్చే జోక్స్ గురించి కూడా మాట్లాడింది. వాటిని తాను చాలా ఎంజాయ్ చేస్తానన్న ఆమె.. కొన్నింటిని రజినీకి కూడా చెబుతుంటానని అన్నది. రీసెంట్ గా వచ్చిన డీమానిటైజేషన్ తర్వాత.. రజినీకాంత్ పై వచ్చిన జోక్ ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.

తన దగ్గరున్న పాత నోట్లు మార్చుకునేందుకు రజినీకాంత్ బ్యాంక్ కి వెళితే.. అప్పుడు బ్యాంకులే వాటి ఐడీ ప్రూఫ్ లను రజినీకాంత్ కు సమర్పిస్తాయన్నదే ఆ జోక్. ఈ జోక్ ని తండ్రికి చెబితే.. తన స్టైల్ లో నవ్వేసి వెళ్లిపోయారని అంటోంది ఐశ్వర్య. తన మీద వచ్చే జోక్స్ ను ఎంజాయ్ చేయగలిగే సూపర్ స్టార్ బహుశా రజినీకాంత్ ఒక్కరే కదూ. 
Tags:    

Similar News