సినీ జనాల్లో ప్రేమలు.. పెళ్లిళ్ల కహానీలు ఎన్ని వినిపిస్తూ ఉంటాయో.. అదే స్పీడ్ లో బ్రేకప్ లు కూడా జరిగిపోతుంటాయి. కొన్నేళ్లుగా అయితే కలయికల కంటే విడిపోవడాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో ఓ జంట తమ పెళ్లికి పదేళ్ల వేడుక జరుపుకుంటున్నారు.
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యా రాయ్.. అభిషేక్ బచ్చన్ ల పెళ్లి జరిగి ఇవాల్టితే పదేళ్లు పూర్తయింది. 2007 ఏప్రిల్ 20న వీరిద్దరు పెళ్లి చేసుకోగా.. ప్రస్తుతం వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అమితాబ్ బచ్చన్ కోడలిగా.. బచ్చన్ ఫ్యామిలీలోకి కోడలిగా అడుగుపెట్టిన తర్వాత.. ఐశ్వర్యారాయ్ లో హుందాతనం మరీ ఎక్కువైపోయింది. ఆ రేంజ్ ను కాపాడేస్తోంది కూడా. ఇప్పుడు వీరి పెళ్లయి పూర్తయిన సందర్భంగా.. విషెస్ చెబుతున్నాడు కరణ్ జోహార్. '10 అందమైన సంవత్సరాలు గడిపిన జూనియర్ బచ్చన్.. ఐశ్వర్యారాయ్ బచ్చన్.. కు కంగ్రాచ్యులేషన్స్. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో. మీ పెళ్లిలో సంగీత్ కార్యక్రమంలో పెర్ఫామెన్స్ ఇంకా నా కళ్ల ముందు మెదులుతోంది' అన్నాడు కరణ్ జోహార్
డైవర్సులు ఎక్కువైపోతున్న ప్రస్తుత తరుణంలో.. ఇప్పుడు పెళ్ళికి కూడా పదేళ్ళు అంటూ సెలబ్రేషన్లు చేసుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. అయితే.. బచ్చన్ ఫ్యామిలీ ఇచ్చే పార్టీ డీటైల్స్ ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/