రాకింగ్ స్టార్ యశ్ ఇపుడు కన్నడ స్టార్ మాత్రమే కాదు. సౌత్ ఇండియా హద్దులు చెరిపేసిన కేజీఎఫ్ రాఖీభాయ్. కేజీఎఫ్ లాంటి డబ్బింగ్ సినిమాతోనే బాలీవుడ్‌లో కలెక్షన్ల సునామీని సృష్టించి యశ్ స్టార్ డమ్‌ను అమాంతం పెంచుకున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ సీక్వెల్‌తో బిజీగా ఉన్న యష్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలంటే సినీ అభిమానులకు బంగారం దొరికినట్లే. ఆయన మేకింగ్‌ను ఇష్టపడని వారుండరు. గత కొన్నేళ్లుగా మణిరత్నం కు సరైన సక్సెస్ రాలేదు. చివరగా నవాబ్ చిత్రంతో ఓ మోస్తరు విజయం వరించినా తదుపరి చిత్రాన్ని మాత్రం భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఒక ఫేమస్ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాలామంది స్టార్లు నటిస్తున్నారు.
ప్యాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, విక్రమ్ ప్రభు, ఐశ్వర్యా లక్ష్మీ, ఐశ్వర్యా రాయ్, శోభితా ధూళిపాల, అదితి రావ్ హైదరీ, అశ్విన్, జయరామ్ వంటి భారీ తారాగణం నటిస్తుంది. ఈ సినిమాకు 'పొన్నియన్ సెల్వన్' అనే పేరును అనుకుంటున్నారట. అయితే ఈ సినిమాలోని ఓ ముఖ్యమైన పాత్రకు రాకింగ్ స్టార్ యశ్‌ను తీసుకోవాలని మణిరత్నం భావిస్తున్నారట. ఇందుకోసం రంగంలోకి దిగిన సుహాసిని యశ్ ని ఒప్పించిందట. యశ్ కి కూడా కథ నచ్చి నటించేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే ఈ చిత్రంలో ఐశ్వర్యా రాయ్ బంధువు, పాండ్య రాజుగా యశ్ కనిపిస్తాడని సినీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం యశ్ కేవలం ముప్పై రోజుల కాల్షీట్స్ మాత్రమే ఇచ్చినట్టు టాక్. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.