ఐశ్వర్యారాయ్ అంటే పడి చచ్చిపోయే వాళ్లు దేశంలో కోట్లలో ఉంటారు. పెళ్లయ్యి ఒక పాపకి తల్లయినా కూడా అందానికి కేరాఫ్ అడ్రస్ గా ఇంకా ఆమెనే చెప్పుకుంటారు సినీ జనాలు. అలాంటి అందగత్తెకు మామూలు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందా? అయినా ఎందుకో ఐష్ ఇంతకాలం సోషల్ మీడియాకు అభిమానులకు దూరంగా ఉంది. ఎంతో మంది బాలీవుడ్ భామలు సోషల్ మాధ్యమాల సాయంతో అభిమానులను అలరిస్తుంటే ఐష్ మాత్రం ఏమీ పట్టనట్టు కుటుంబం సినిమాలే లోకంగా ఉంది. ఇప్పుడు ఆమె కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టింది. కానీ ఊహించని విధంగా ఉంది అభిమానుల నుంచి రెస్పాన్స్.
ముందుగానే ఐశ్వర్య ఇన్ స్టాగ్రామ్ లో అడుగుపెడుతోందంటూ ట్రెండైంది. మే 11 ఉదయం పావుతక్కువ పదకొండు గంటలకు ఐష్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచింది. ఆమె ఊహించినదేంటంటే తాను ఖాతా తెరిచేసరికి కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చిపడతారు... అది రికార్డు అవ్వడం ఖాయం అని. ఆమెనే కాదు ఎంతో మంది సినీజనాల అంచనా కూడా అలాగే ఉంది. కానీ అనుకున్నది ఒక్కటి జరిగింది ఒక్కటి. ఐష్ ఖాతా తెరిచిన ఆరు గంటలు తరువాత చూస్తే కేవలం 18 వేల మంది మాత్రమే ఫాలోవర్స్ గా చేరారు. దీంతో ఐష్ చాలా ఫీలయ్యిందట. తన టీమ్ సరిగ్గా ప్రమోట్ చేయలేదని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందట.
ప్రస్తుతం ఐష్ ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్‌ను పద్నాలుగు లక్షల మంది దాకా ఫాలోఅవుతున్నారు. కాస్త లేటుగా స్పందించినా...అభిమానుల స్పందన ఐష్ విషయంలో బాగానే ఉంది. శుక్రవారం సాయంత్రం నుంచి ఎక్కువ మంది ఫాలోవర్లుగా చేరడం మొదలుపెట్టారు. సునామీ ఫాలోవర్స్ రాకపోయినా... లేటుగా లక్షలాదిగా వచ్చి చేరారు.