కేన్స్ 2019 సంబరాల్లో ఏదో మిస్సయ్యిందే అంటూ అభిమానులు ఆసక్తిగా మాట్లాడుకున్నారు. క్వీన్ కంగన .. ప్రియాంక చోప్రా.. దీపిక పదుకొనే లాంటి అందగత్తెలు వెరైటీ లుక్ తో కేన్స్ వేదికను అల్లాడించారు. రకరకాల డిజైనర్ డ్రెస్ లలో కనిపించి రెడ్ కార్పెట్ ని వేడెక్కించారు. అయినా ఇంకా ఏదో లోటు కేన్స్ లో స్పష్టంగా కనిపించింది అంటూ ఫ్యాన్స్ ఒకటే గుసగుసలాడారు. అయితే ఆ లోటు ఐశ్వర్యారాయ్ లేకపోవడమేననడంలో సందేహమే లేదు.
నిన్నటిరోజున ఐష్ కేన్స్ చిత్రోత్సవాలకు ఎటెండవుతున్నారన్న మాటతో కొత్త ఉత్సాహం నెలకొంది. కేన్స్ అంటేనే ఐశ్వర్యారాయ్. ఐష్ వస్తుంది.. హంస నడకలు నడుస్తుంది.. ఆ అందమే వేరు! అంటూ కళ్లు కాయలు కాసేలా ప్రపంచం ఎదురు చూస్తుంటుంది. దశాబ్ధ కాలంగా ప్రతియేటా కేన్స్ సంబరాల్లో ఐష్ పాల్గొంటూనే ఉంది. ప్రస్తుతం కేన్స్ 72వ ఉత్సవాల్లోనూ ఐష్ పాల్గొంది. ఐశ్వర్యారాయ్ - ఆరాధ్య బచ్చన్ జోడీ కేన్స్ 2019 ఉత్సవాల్ని ఒక్కసారిగా హీటెక్కించారు. బుల్లి ఆరాధ్య అదిరిపోయే పింక్ గులాబీ డ్రెస్ లో మామ్ ఐష్ తో కలిసి రెడ్ కార్పెట్ పై క్యూట్ అప్పియరెన్స్ ఇచ్చింది. ఇక మైండ్ బ్లాక్ అయ్యే లుక్ తో ఐశ్వర్యారాయ్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదు.
ఆక్వేరియం నుంచి జారిపడిన మత్స్యాన్ని తలపించేలా ఐష్ లుక్ ని డిజైన్ చేయడం ఆకర్షించింది. రోజ్ గోల్డ్ - లైట్ గ్రీన్ మిక్స్ చేసిన స్పెషల్ డిజైనర్ వేర్ లో ఐష్ తళతళలాడిపోయింది. ఇంద్రలోకం నుంచి అతిలోక సుందరి దిగి వచ్చిందా.. అన్నంతగా ఆ డిజైనర్ లుక్ తో అదరగొట్టింది. ఈ డిజైనర్ డ్రెస్ ని ఏమని పిలుస్తున్నారు? అంటే ``షిమ్మరీ మెటాలిక్ డ్యుయల్ టోన్డ్ ఫిష్ కట్ గోల్డ్ గౌన్`` అంటూ పిలవడం ఆసక్తికరం. దీనిని డిజైన్ చేసిన డిజైనర్ ఎవరు? అంటే .. ప్రఖ్యాత జీన్- లూయీస్ సబాజీ ఈ డిజైనర్ డ్రెస్ ని రూపొందించారట. ఐష్ విశాలమైన షోల్డర్ ని .. ఆ స్మైల్ ని ఎలివేట్ చేసేలా ఈ డ్రెస్ ని రూపొందించారు. అయితే అంత తళతళలాడే ఆ డ్రెస్ ధరించినా చాలా తక్కువ మేకప్ తో ఐష్ ని ప్రిపేర్ చేశారట. మేకప్ కోసం అనవసర హంగామా ఏదీ చేయలేదు.