ఐష్ సినిమాకు అలాంటి షాక్ తగిలిందా?

Update: 2016-03-18 19:30 GMT
బాలీవుడ్ లో బయోపిక్ ల జోరు మా గొప్పగా సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా పాక్ లో మగ్గిపోయిన సరబ్ జీత్ వ్యక్తి జీవిత చరిత్రను కథగా తీసుకొని.. సినిమాగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పొరపాటున పాకిస్థాన్ సరిహద్దుల్లోకి వెళ్లిన నేరానికి.. గూఢాచారి అన్న ముద్రతో పాక్ జైల్లో దశాబ్దాల పాటు మగ్గిన వ్యక్తి జీవితగాథనే తీసుకొని ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. చేయని నేరానికి  ఏళ్లకు ఏళ్లు పాక్ జైల్లో మగ్గిన సరబ్ జీత్ సినిమా షూటింగ్ ను తాజాగా పంజాబ్ సరిహద్దు ప్రాంతమైన వాఘా సరిహద్దుల్లో షూట్ చేస్తున్నారు. షూటింగ్ జోరుగా సాగుతున్న సమయంలో స్థానికులు కొందరు ప్లకార్డులు పట్టుకొని పాకిస్థాన్ కు అనుకూలంగా.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి రావటమే కాదు.. నిర్మాతను తమ అదుపులోకి తీసుకున్నారు.

ఊహించని ఈ పరిణామానికి చిత్ర సిబ్బంది షాక్ కు గురయ్యారు. భారత్ వ్యతిరేక నినాదాల్ని ఉర్దూలో చేసిన ఈ మూక.. తమ మనోభావాల్ని దెబ్బ తీస్తూ ఇలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. అనంతరం పోలీసుల రంగప్రవేశంతో అక్కడ  పరిస్థితులు చక్కదిద్దారు. దేశ సరిహద్దు ప్రాంతంలో భారత్ వ్యతిరేక వ్యాఖ్యల్ని చేయట ఏమిటి? ఇలాంటి వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News