ఒక మోడల్ ప్రపంచ సుందరిగా సెలెక్ట్ అయ్యిందంటే అందుకు కారణం అందం కంటే ముందు కనిపించని మనసు కూడా ఒక కారణం. సెలెక్ట్ చేసే కమిటీ కూడా అందంతో పాటు ఆమె వ్యక్తిగతన్నీ పరిశీలనలోకి తీసుకుంటోంది. ఆ విధంగా అందంతో పాటు మనసు కూడా మంచి అందమైనదే అని నిరూపించుకొని ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఇండియన్ వుమెన్ ఐశ్వర్య రాయ్.
సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతే కాకుండా పెళ్లి తర్వాత మంచి ఇల్లాలిగా కొనసాగుతూ ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లిగా జీవితాన్ని గడుపుతోంది. అయితే ఐశ్వర్య జీవితంలో ఎంతో బాధించిన విషయం తన తండ్రిని కోల్పోవడమే. ఐశ్వర్య రాయ్ తండ్రి కృష్ణారాజ్ రాయ్ మరణించినప్పుడు ఆమె ఎంతో మనోవేదనకు గురైంది. అయితే ఈ రోజు అయన పుట్టిన రోజు సందర్బంగా ఐశ్వర్య ఒక మంచి కార్యక్రమాన్ని తలపెట్టింది. ఈరోజు ఐష్ తన కుమార్తెతో అలాగే తల్లి వృందా రాయ్ తో కలిసి ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు.
అనాథ పిల్లలను కలిసి వారితో సరదాగా గడపనున్నారు. అయితే ఎంతో మంది చిన్నారులు సరైన సమయానికి డబ్బు అందక మరణిస్తున్నారు. దీంతో ఐశ్వర్య 100 మంది పేద పిల్లల జీవితాల్ని తన తండ్రి పేరు మీద కాపాడాలని నిర్ణయం తీసుకుంది. ముంబయికి చెందిన ప్రముఖ స్మైల్ ట్రెయిన్ ఇండియా అనే స్వచ్ఛంద సంస్థ వారి సాయంతో గ్రహణం మొర్రి సమస్యతో సతమతవుతున్న చిన్నారులకు సర్జరీ చేయించడానికి ప్రపంచ సుందరి సిద్ధమైంది.
అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నావ్ ఐశ్వర్య అని అడిగితే.. ఇప్పుడు సమాధానం చెప్పింది. ''2014లో మా నాన్న కృష్ణారాజ్ కూడా ఇలాగే గ్రహణం మొర్రి సమస్యలతో బాధపడుతున్న 100 మంది చిన్నారులకు సర్జరీ చేయించారు. అందుకే ఇప్పుడు ఆయన ఆశయాన్ని నేను కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను'' అని చెప్పింది. నాన్నకు ప్రేమతో ఐష్ చేస్తున్న పనిని అభినందించాల్సిందే.