ఫ్రాన్స్ ప్రెసిడెంట్ కోసం రెడ్ శారీలో ఐష్

Update: 2016-01-26 15:30 GMT
రిపబ్లిక్ డే సందర్భంగా మనదేశానికి ప్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలండే విశిష్ట అతిథిగా విచ్చేశారు. అదే రోజు మధ్యాహ్నం ఆయనకు ప్రత్యేకమైన లంచ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమనికి బాలీవుడ్ బ్యూటీ, మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్ ను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించారు. సంప్రదాయ దుస్తుల్లో ఈ లంచ్ కు హాజరైంది ఐశ్వర్య.

రెడ్ కలర్ డిజైనర్ శారీలో, పోల్కీ జ్యూవెల్రీ ధరించి, ముఖాన బొట్టుతో.. అచ్చమైన భారతీయతకు అద్దం పట్టింది ఐష్. ఈమె ధరించిన ఈ శారీని డిజైనర్లు స్వాతి - సునయన రూపొందించారు. బెనారస్ కు చెందిన నిపుణులైన కళాకారులతో.. మల్బరీ సిల్క్ మరియు జరీతో పాటు పూర్తి సిల్క్ దారాలాతో తయారు చేశారు. మధ్యమధ్యలో బంగారు పోగులు వాడి తయారు చేసిన ఈ చీరను మెహ్రాబ్ అంటారు. తయారైన తర్వాత బుటా కూడా అద్దడంతో.. ఈ ఆరడుగుల అద్భుతమైన చీర రూపొందుతుంది. దేశానికి విశిష్ట అతిథిగా వచ్చిన ఫ్రాంకోయిస్ హాలండేకు.. మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు, ఆయన గౌరవార్ధం కార్యక్రమ నిర్వహించేందుకు.. ప్రపంచం అంతా తెలిసిన ఐశ్వర్యా రాయ్ ని పిలవడమే కాకుండా.. ఆమెకోసం ప్రత్యేకించి తయారు చేసిన చీర ఇది.

ఇంతటి మెరుపులు ఉన్న ఈ శారీ.. ఐశ్వర్య అందానికి అద్దినట్లుగా సరిపోయింది. దీని రూపకల్పనకు సంబంధించి, ప్రధాని కార్యాలయం నుంచి సూచనలు అందడం విశేషం.

Tags:    

Similar News