కొన్ని సినిమాలను ఏ భాషలో వచ్చినవి అయినా మిస్ చేసుకోకూడదు. అలాంటి వాటిలో రియల్ లైఫ్ స్టోరీలు కూడా కొన్ని ఉంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో ఇదే ట్రెండ్ నడుస్తోంది. భాగ్ మిల్కా భాగ్, ఎయిర్ లిఫ్ట్, మేరీ కోమ్, నీర్జా ల తర్వాత ఇప్పుడు సరబ్ జిత్ మూవీ విడుదలకు సిద్ధమైంది. ఐశ్వర్యారాయ్ - రణ్ దీప్ హుడాలు లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ స్టోరీ ఏంటో భారత దేశ జనాలు అందరికీ తెలుసు.
అనుకోకుండా ఇండియా బోర్డర్ దాటి పాకిస్థాన్ లో అడుగు పెట్టిన సరబ్ జీత్ అనే వ్యక్తిని 20 ఏళ్ల పాటు జైల్ లో బంధించగా.. అతన్ని విడిపించడానికి సోదరి దల్బీర్ కౌర్ అనేక ప్రయత్నాలు చేస్తుంది. అయితే చివరకు సరబ్ జిత్ ను పాకిస్తాన్ చంపేస్తుంది. ఇక్కడ అజ్మల్ కసబ్ ను ఉరితీసినందుకు ప్రతిగా సరబ్ జిత్ ను హతమార్చించి పాక్. ఇధి సరబ్ జిత్ మూవీ స్టోరీ. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. దల్బీర్ కౌర్ గా ఐశ్వర్యారాయ్ నటన, దేశం గురించి ఆమెచెప్పిన మాటలు హైలైట్ గా నిలుస్తాయి. ఇలాంటి విభిన్న పాత్రలు చేయడంలో తన ట్యాలెంట్ ఏంటో.. రణ్ దీప్ హుడా మరోసారి నిరూపించుకున్నాడు.
మొత్తం ట్రైలర్ ఆడియన్స్ ను గుక్క తిప్పుకోనివ్వదు. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తి కలిగించే స్థాయిలో సరబ్ జిత్ ట్రైలర్ ఉంది. మే 20న విడుదల కానున్న ఈ చిత్రానిిక మేరీకోమ్ ను డైరెక్టర్ చేసిన ఒముంగ్ కౌర్ తీస్తుండడం విశేషం.
Full View