ఒకే ఒక్క మీమ్ అతడిని నేరస్తుడిని చేసింది. ఏదో జోక్ చేయబోయి అడ్డంగా బుక్కయ్యాడు. సీన్ ఎంతవరకూ వెళ్లింది అంటే ఒకరి వైఫ్ పై కుళ్లు జోకులేస్తావా? అంటూ ఏకంగా మహారాష్ట్ర మహిళా కమీషన్ జోక్యం చేసుకుని అతడికి కోర్టు నోటీసులు సైతం పంపింది. మొత్తానికి చేసిన తప్పునకు స్టార్ హీరో వివేక్ ఒబేరాయ్ లెంపలు వేసుకుని సారీ చెప్పాల్సొచ్చింది. అంత పెద్ద హీరోకి ఏంటీ దుస్థితి? అంటూ మాట్లాడుకున్నారంతా. సామాజిక మాధ్యమాల ట్రెండ్ లో అంతర్జాలాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి కానీ మీమ్స్- జోక్స్ పేరుతో కామెడీలు చేస్తే అబాసుపాలవ్వాల్సిన సన్నివేశం నెలకొందని తాజా ఉదంతం చెబుతోంది.
ఈ ఎపిసోడ్ లో ఐశ్వర్యారాయ్ భర్త అభిషేక్ బచ్చన్ ఎంతో హర్టయ్యారన్నది తాజా అప్ డేట్. సామాజిక మాధ్యమాల్లో ఐశ్వర్యారాయ్ ని కించపరిచే అభ్యంతరకర మీమ్ పై విస్త్రతంగా చర్చ సాగింది. దీనిపై సల్మాన్ ఖాన్ సైతం మీడియా ముందు స్పందించారు. అలాంటి కుళ్లు జోకులు పట్టించుకోనని అన్నారు. అప్పటికి ఐష్ ఫ్రెంచి రివెరా(ఫ్రాన్స్) దేశంలో కేన్స్ ఉత్సవంలో బిజీబిజీగా ఉంది. ఇలా ఎలక్షన్ మూవ్ మెంట్ ని పురస్కరించుకుని వివేక్ ఒబేరాయ్ మీమ్ ని వైరల్ చేశాడని తెలవగానే ఎంతో బాధపడ్డారట.
ఆ వ్యవహారంలో అభిషేక్ బచ్చన్ చాలా సీరియస్ అయ్యారని.. ఒబేరాయ్ పై సీరియస్ యాక్షన్ కి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అస్సలు స్పందించవద్దని ఐశ్వర్యారాయ్ తన భర్తకు చెప్పారట. తను ఎంతో పరిణతితో వ్యవహరించడం వల్లనే గొడవ ఆగింది. లేకపోతే ఇద్దరు హీరోల మధ్య కొట్లాటకు దారి తీసే వ్యవహారమే ఇది. కోర్టుల పరిధికి వెళ్లేంత పెద్దది అయ్యేదని చెబుతున్నారు. సల్మాన్ - వివేక్ ఒబేరాయ్- అభిషేక్ బచ్చన్ ఫోటోలకు ఐష్ ఫోటోని యాడ్ చేసి ఒబేరాయ్ చేసిన మీమ్.. కుళ్లు జోకు గురించి తెలిసిందే.