మాతృత్వం అనేది ప్రతి మహిళకు మరిచిపోలేని అనుభూతి. నవమాసాల పాటు బిడ్డను కడుపులో మోసి ప్రాణాలు పణంగా పెట్టి బిడ్డను భూమిమీదకు తెస్తుంది. ప్రతిదీ కమర్షియల్ అయిపోతున్న ఈ రోజుల్లో తల్లి గర్భం కూడా వ్యాపార వస్తువుగా మారిపోతున్న సంఘటనలను మీడియా వెలుగులోకి తెస్తూనే ఉంది. అత్యంత సున్నితమైన ఈ అంశంతో ఇప్పుడు బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోంది. జాస్మిన్ పేరిట తెరకెక్కనున్న ఈమూవీకి స్టోరీ ఆఫ్ ఏ లీజ్ డ్ ఊంబ్ అనే క్యాప్షన్ పెట్టారు. అద్దెకు గర్భాన్ని ఇచ్చిన మహిళ కథ అని దీనర్ధం.
గుజరాత్ కు చెందిన ఓ మహిళ సరోగసీ ద్వారా పిల్లలను కనాలనుకున్న వారి కోసం తన గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. తీరా బిడ్డ పుట్టాక పేగుబంధాన్ని తెంచుకోలేక కన్నబిడ్డ కోసం పోరాటం మొదలుపెడుతుంది. ఇందులో లీడ్ పాత్ర చేయాల్సిందిగా ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ను సినిమా టీం కోరింది. ఈ రోల్ చేస్తానా లేదా అన్నది ఐశ్వర్య తేల్చిచెప్పలేదు. ఆమె ఏం చెబుతుందా అని యూనిట్ ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఈ రోల్ కానీ ఒప్పుకుంటే ఐశ్వర్య కెరీర్ లో అత్యంత ఛాలెంజింగ్ రోల్స్ లో ఒకటిగా జాస్మిన్ పాత్ర నిలిచిపోతుందని జాస్మిన్ యూనిట్ అంటోంది.
క్రియార్జ్ ఎంటర్ టెయిన్ మెంట్ - శ్రీ మూకాంబికి పిక్చర్స్ సంయుక్తంగా జాస్మిన్ చిత్రాన్ని నిర్మించనున్నాయి. జాస్మిన్ సినిమాను సిద్ధార్ద్ గరిమ డైరెక్ట్ చేయబోతున్నాడు. హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫర్మ్ కాకపోయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ చేశారు. కమింగ్ సూన్ అని కాకుండా డెలివరింగ్ సూన్ అంటూ సినిమాపై ఆసక్తి పెంచేలా క్యాప్షన్ జోడించారు.