ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి.. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ - అతని భార్య కాజోల్ ముందుకొచ్చారు. ఇప్పటికే చంద్రబాబుతో భేటీ అయ్యి - తమ ఆసక్తితోపాటు - ఏపీలో పెట్టుబడుల అంశంపై కూడా చర్చలు జరిపారు. అయితే.. తెలుగు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా హిందీ యాక్టర్లను తెచ్చుకోవాల్సిన అవసరమేంటనే ప్రశ్న తలెత్తడం సహజం. ఏపీకి ప్రచారం చేయడానికి.. స్టార్ హీరోలు చాలామందే ఉన్నారు. చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పాటు.. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు - ఎన్టీఆర్ - ప్రభాస్ లను కూడా ఎంచుకోవచ్చు.
కానీ వీరెవరినీ కాకుండా.. బాలీవుడ్ నుంచి స్టార్లను పట్టుకురావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. చిరు - పవన్ - బాలయ్య రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి.. వాళ్లను వదిలేసినా, మిగిలిన వారి పేర్లయినా పరిశీలించవచ్చు. అధి కూడా చేయలేదు. అయితే.. ఇక్కడ అన్నింటికంటే క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా పరిగణించారని అంటున్నారు. ఏ హీరోని తీసుకున్నా.. కులాల కాన్సెప్ట్ తెరపైకి వస్తుందనే టాక్ ఉంది.
అసలే రిజర్వేషన్ల పేరుతో రచ్చ నెలకొన్న సమయంలో.. మళ్లీ ఇంకో వివాదాన్ని కోరి తెచ్చుకోవడం కరెక్ట్ కాదనే ఉద్దేశ్యంతోనే.. టాలీవుడ్ హీరోలకి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఏమైనా కానీ.. తెలుగు రాష్ట్రం కోసం హిందీ స్టార్లు వచ్చి ప్రచారం చేయడం అంటే.. వినడానికి కొంచెం ఇఫ్పందిగానే ఉంది.