బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ గత కొంతకాలంగా పలు విధాలుగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. RRR వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో భాగమైన అజయ్.. ఈ ఏడాదిలోనే 'గంగూబాయి' సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు.
ఇటీవల మాన్ మసాలా యాడ్ బయటకు రావడంతో.. అజయ్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇదే క్రమంలో జాతీయ భాషా వివాదం పెద్దది కావడానికి కారణమైన నెట్టింట దారుణంగా ట్రోల్ చేయబడ్డాడు.
ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్ ''రన్ వే 34'' అనే సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు. సౌత్ డబ్బింగ్ సినిమా 'KGF: చాప్టర్ 2' నార్త్ లో వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న టైమ్ లో ఈద్ వీకెండ్ ను టార్గెట్ చేస్తూ ఏప్రిల్ 29న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. అయితే ఇది ప్రేక్షకులపై ప్రభావం చూపడంలో విఫలమైంది.
అజయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అమితాబ్ బచ్చన్ - రకుల్ ప్రీత్ సింగ్ - బోమన్ ఇరానీ వంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్నా.. దురదృష్టవశాత్తూ ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టలేకపోయింది.
ఏవియేషన్ థ్రిల్లర్ గా వచ్చిన 'రన్ వే 34' సినిమా తొలిరోజు కేవలం రూ.3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల మధ్య మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అదే సమయంలో 'KGF 2' సినిమా మూడో వారంలోనూ రూ. 4.25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
దీంతో వారాంతంలో అజయ్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. నిజానికి 'రన్ వే 34' సినిమా కథాంశం అందరినీ ఆకట్టుకునేదే. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద పేలవంగా ప్రారంభమైంది.
ఓపెయింగ్ డే నాడు 15 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే రాబట్టడానికి కారణం అజయ్ దేవగన్ లేవనెత్తిన బాషా ప్రాధాన్యత వివాదమే అనే టాక్ వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం, కన్నడ హీరో కిచ్చా సుదీప్ ఓ ఈవెంట్ లో హిందీ భాషపై కీలక వ్యాఖ్యలు చేశారు.
అయితే అతను ఏ సందర్భంలో ఆ కామెంట్స్ చేసారనేది తెలుసుకోకుండా.. సుదీప్ కు కౌంటర్ గా ట్వీట్ పెట్టారు. హిందీ జాతీయ భాష అని.. ఎప్పటికీ అలానే ఉంటుందని పేర్కొన్నారు. అజయ్ ట్వీట్ పై మెజారిటీ వర్గం అభ్యంతరాలు వ్యక్తం అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
దక్షిణాది సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటడాన్ని చూసి తట్టుకోలేక ఇలా జాతీయ భాష వివాదానికి నాంది పలికారని విమర్శించారు. భారత రాజ్యాంగం హిందీని అధికారిక భాషగా మాత్రమే పేర్కొందని.. జాతీయ భాషగా ఎంపిక చేయలేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో గతంలో అజయ్ దేవగన్ సినిమాలను ఆదరించిన సౌత్ ఇండియా అభిమానులు.. 'రన్ వే 34' సినిమా చూడటానికి ఆసక్తి కనబరచలేదు. అంతేకాదు సోషల్ మీడియాలో నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. దీనికి తగ్గట్టే ఓపెనింగ్స్ వచ్చాయి.
'కేజీయఫ్ 2' ఎఫెక్ట్ కచ్చితంగా ఉంటుందని తెలిసినప్పటికీ.. 'రన్ వే 34' సినిమా ఓ మోస్తరు వసూళ్ళు రాబడుతుందని అందరూ భావించారు. కానీ అజయ్ దేవగన్ జాతీయ భాషా కామెంట్స్ వివాదాస్పదం అవడం.. అది చిలికి చిలికి గాలి వానలా మారడం తన సినిమాపై ప్రభావం చూపాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.