బిల్లా సినిమా పేరు చెబితే.. మనకు డార్లింగ్ ప్రభాస్ గుర్తొస్తాడు కానీ.. దీనికి ముందు ఈ కేరక్టర్ ని అజిత్ ఉతికి ఆరేశాడు. బిల్లా ఏదీ చెప్పడు చేసి చూపిస్తాడు అంటూ డైలాగ్స్ కూడా చెబ్తాడు. ఇప్పుడు చెన్నై వరద బాధితులను ఆదుకోవడంలో కూడా అదే స్టైల్ కంటిన్యూ చేస్తున్నాడు తల అజిత్.
ఇప్పటికే కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించాడు అజిత్. ఇది అందరూ చేస్తున్నదే. అయితే., తన ఇంటిలో 180మందికి ఆశ్రయం ఇచ్చి, వారందరి అవసరాలు చూడడమంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని ఓ టీవీ ఛానల్ తెలుసుకుని బయటపెట్టిందంతే. అంతవరకూ ఈ విషయం తను చెప్పుకోలేదు. ప్రచారం కోసం ప్రయత్నించలేదు. కనీసం ఓ ట్వీట్ కూడా చేయలేదు. దీంతో దటీజ్ తల అజిత్ అంటూ.. ఫ్యాన్స్ తమ హీరో గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు.
మరోవైపు అజిత్ భార్య శాలిని కూడా 400మందికి ఆహార పొట్లాలు అందించే కార్యక్రమం చేపట్టింది. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి వీలైనంతగా సహాయం చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఇలా సైలెంట్ గా సేవ చేసేస్తుండడం అభినందనీయమే.