AK61 నిర్మాణంలోనూ భాగం కానున్న కింగ్ నాగ్..?

Update: 2022-02-03 02:30 GMT
కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ డబ్బింగ్ సినిమాతో తెలుగులోనూ క్రేజ్ ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ నటించిన 'వలిమై' చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. బోనీ కపూర్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాని ఫిబ్రవరి 24న రిలీజ్ చేయనున్నారు. అయితే దీని తర్వాత వీరు ముగ్గురూ కలిసి మూడోసారి జత కట్టడానికి రెడీ అవుతున్నారు.

ఇది అజిత్ కెరీర్ లో 61వ సినిమాగా రానుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మార్చి 9న #AK61 చిత్రాన్ని ప్రారంభించడానికి ఇప్పటికే హైదరాబాద్ లో భారీ సెట్ ను నిర్మిస్తున్నారని సమాచారం. భారీ స్థాయిలో రూపొందే ఈ ప్రాజెక్ట్ లో దక్షిణాదికి చెందిన పలువురు పాపులర్ స్టార్స్ భాగం కానున్నారని తెలుస్తోంది.

#AK61 లో కీలకమైన పోలీస్ కమీషనర్ పాత్రలో కింగ్ అక్కినేని నాగార్జున కనిపించనున్నారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న నాగ్.. అజిత్ సినిమాలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు

లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ సినిమా నిర్మాణంలో అక్కినేని ఫ్యామిలీ సంస్థ అన్నపూర్ణ ప్రైవేట్ లిమిటెడ్ కూడా భాగం కానున్నారట. బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ తో సన్నిహిత సంబంధాలు కలిగియున్న నాగార్జున.. ఇప్పుడు #AK61 చిత్రాన్ని తెలుగులో కో ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఇకపోతే ఈ చిత్రంలో అజిత్ సరసన అదితి రావు హైదరీ కథానాయికగా నటించనుందని టాక్. అలానే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నారట. కంప్లీట్ యాక్టర్ గతంలో పలు తెలుగు తమిళ చిత్రాన్ని నటించిన సంగతి తెలిసిందే.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న 'AK61' సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను ఆరు నెలల్లోనే పూర్తి చేసే విధంగా షూటింగ్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2023 సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందులో నిజా నిజాలు తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Tags:    

Similar News