బతుకుదాం - బతికిద్దాం.. ఫ్యాన్స్ కి స్టార్ హీరో స్వీట్‌ వార్నింగ్‌

Update: 2022-11-18 08:33 GMT
టాలీవుడ్‌ స్టార్ హీరోల అభిమానులు కోలీవుడ్‌ స్టార్‌ హీరోల అభిమానులు నువ్వా నేనా అన్నట్లుగా తమ అభిమాన హీరోలపై అభిమానం ను చూపిస్తూ ఉన్నారు. ఒకప్పడు ఫ్లెక్సీలతో తమ అభిమానం చాటుకున్న అభిమానులు ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా తయారు అయ్యారు. తమ హీరో పై అభిమానంను ఇతర హీరోలపై కోపంగా పెంచుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో తెలుగు హీరోల అభిమానులతో పోల్చితే తమిళ స్టార్‌ హీరోల అభిమానుల యొక్క అరాచకాలు మరీ దారుణంగా పెరిగి పోతున్నాయి. ముఖ్యంగా తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ అభిమానులు వర్సెస్‌ అజిత్‌ అభిమానులు అన్నట్లుగా సోషల్‌ మీడియాలో పరిస్థితి వాడి వేడిగా కొనసాగుతోంది.

వచ్చే ఏడాది పొంగల్ కి విజయ్‌ నటిస్తున్న వారసుడు సినిమాతో పాటు అజిత్ నటిస్తున్న సినిమా కూడా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాల విడుదల హడావుడి మొదలు కాకుండానే అభిమానుల యొక్క సోషల్‌ మీడియా హడావుడి మొదలు అయ్యింది. మా హీరో పొంగల్ విజేత అంటే మా హీరో పొంగల్‌ విజేతా అన్నట్లుగా గొడవలు చేస్తున్నారు.

పెద్ద ఎత్తున పొంగల్ సినిమాల ప్రమోషన్స్ జరగాల్సిన ఈ సమయంలో సోషల్‌ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ పేరుతో సినిమాలకు జరగబోతున్న డ్యామేజీని తల్చుకుని ఆయా సినిమాల యొక్క నిర్మాతలు మరియు దర్శకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో హీరో అజిత్‌ అభిమానులకు స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చాడు.

మనం బతకడంతో పాటు అవతలి వారిని కూడా బతకనిద్దాం. నెగెటివిటీ వద్దు.. సోషల్‌ మీడియాలో డ్రామా వద్దు.. మీ చుట్టు కూడా మిమ్ములను ప్రోత్సహించే వారిని పెట్టుకోండి. ఉన్నత లక్ష్యాలను పెట్టుకుని వాటిని సాధించేందుకు ప్రయత్నించండి అంటూ అజిత్‌ ఫ్యాన్స్ కు హిత భోద చేయడం జరిగింది.

అభిమానులకు అజిత్‌ చేసిన ఈ వ్యాఖ్యలు కచ్చితంగా పాజిటివ్ గా రీచ్ అవుతాయని.. దాంతో ఇప్పటి వరకు వారు విజయ్ పై చేసిన విమర్శలు తగ్గే అవకాశాలు ఉన్నాయని.. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత దూషణలు తగ్గుతాయని.. అలాగే ఇక నుండి స్నేహపూర్వక వాతావరణం ఉండాలంటే విజయ్ ఫ్యాన్స్ కూడా పద్ధతిగా ఉండాలని తమిళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News