తమిళ మాస్ హీరో అజిత్ కుమార్ నటించిన తునివు సినిమా ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసారి అతను డైరెక్ట్ గా విజయ్ వారసుడు తో తలపడబోతున్నాడు. సినిమా ట్రైలర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పటిలానే ఈ సినిమా మనీ ఈస్ట్ తరహాలో ఉండబోతుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో దర్శకుడు హెచ్ వినోద్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు ఎన్నో యాక్షన్ పాత్రలలో అజిత్ ను చూశారు. కానీ ఈ సినిమాలో మాత్రం అందుకు భిన్నంగా చూస్తారు. ఈ సినిమాలో కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ అలాగే పిల్లలు కూడా చూసి ఎంజాయ్ చేసే విధంగానే ఉంటుంది.
ఇక సినిమా కథలో అజిత్ కుమార్ ఒక పవర్ఫుల్ హీరో మాత్రమే కాదు అందుకు దీటుగా ఉండే విలన్ షేడ్స్ కూడా అతనిలో ఉంటాయి. కాబట్టి ఈ సినిమాలో హీరో విలన్ రెండు అతడే. సినిమాలో అజిత్ తన నట విశ్వరూపాన్ని చూపించాడు.
ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ మాత్రం చాలా హైలెట్గా కనిపిస్తాయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరపైకి తీసుకువచ్చాం అజిత్ స్టైల్ కూడా చాలా కొత్తగా ఉంటుంది.
ప్రతి సన్నివేశంలో కూడా అతని ఎలివేషన్ కూడా ఊహించిన విధంగా ఉంటుంది అని.. హెచ్ వినోద్ కుమార్ ఈ సినిమా గురించి వివరణ ఇచ్చాడుమ్ అంతే కాకుండా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ కు నచ్చుతుంది అని నమ్మకంతో ఉన్నట్లు కూడా ఈ దర్శకుడు తెలియజేశాడు.
ఇక అజిత్ కుమార్ ఇంతవరకు ప్రమోషన్స్ లో అయితే పెద్దగా పాల్గొనలేదు మరోవైపు వారసుడు సినిమా ప్రమోషన్లలో మాత్రం విజయ్ కాస్త బిజీగా కనిపిస్తున్నాడు మరి అజిత్ సినిమా ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.