డిజిటల్ ఎంటర్ టైన్మెంట్ కు కొత్త గ్రామర్ నేర్పించిన అమెజాన్ ప్రైమ్ ఈ ఏడాది అమాంతం దూకుడు పెంచేసింది. కొత్త సినిమాలను వీలైనంత తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ తనకు వెయ్యి రూపాయల చందా కట్టిన ప్రేక్షకులకు రెట్టింపు న్యాయం చేసే దిశగా సాగుతోంది. ఇప్పటికే సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఎఫ్2ని బాలయ్య బొనాంజా ఎన్టీఆర్ కథనాయకుడిని సరిగ్గా నెల రోజులకే స్ట్రీమ్ చేసిన అమెజాన్ ఇప్పుడు మరో రెండు అడుగులు ఒకేసారి వేయబోతోంది.
ఈ నెల 25న రామ్ చరణ్ వినయ విధేయ రామ అఫీషియల్ గా అమెజాన్ ప్రైమ్ ద్వారా అందుబాటులోకి రానున్నాడు. విచిత్రంగా దీని ఒరిజినల్ ప్రింట్ గత నాలుగైదు రోజుల నుంచే ఆన్ లైన్ లో హల్చల్ చేస్తోంది. యుట్యూబ్ లో సైతం కొందరు అనధికారికంగా అప్ లోడ్ చేశారు. ఈ కారణంగానే తొలుత మార్చ్ 3 విడుదల చేద్దామనకున్న ప్రైమ్ నాలుగు రోజులు ముందుగానే డిసైడ్ అయినట్టు టాక్.
అయితే అదే రోజు సినిమా ప్రేమికులకు మరో కానుక ఇస్తోంది ప్రైమ్. తమిళ్ లో పొంగల్ కు రిలీజై 150 కోట్లు కొల్లగొట్టి అర్ధశతదినోత్సవానికి పరుగులు పెడుతున్న అజిత్ విశ్వాసం కూడా అదే డేట్ కి అందుబాటులోకి తెస్తున్నారు. ఒకపక్క కన్నడ తెలుగు డబ్బింగ్ వెర్షన్లు రెడీ చేస్తుండగా ఇలా తమిళ్ ప్రింట్ అఫీషియల్ గా ఆన్ లైన్ లోకి వస్తే తప్పకుండా ఎఫెక్ట్ ఉంటుంది. ఇవన్నీ క్యాలికులేట్ చేసుకోకుండా లేట్ చేయటం నిర్మాతల ప్లానింగ్ లోపమే అని చెప్పాలి. తమిళ్ రాకపోయినా సబ్ టైటిల్స్ సహకారంతో ఫ్రీగా చూసే అవకాశం ఉన్నప్పుడు ప్రేక్షకుడిని అదేపనిగా థియేటర్ దాకా రప్పించడం అంత సులువు కాదు. ఏదైతేనేం 24 అర్ధరాత్రి నుంచి మెగా ఫాన్స్ కు తలా అభిమానులకు ఒకేసారి కానుకలు అందించబోతున్న అమెజాన్ ప్రైమ్ వద్ద ఇంకా క్రేజీ బ్లాక్ బస్టర్ల హక్కులు చాలానే ఉన్నాయి