అంతన్నాడే ఇంతన్నాడే గంగరాజు ముంత మామిడి తోపు అన్నాడే గంగరాజు అంటూ గత కొన్ని రోజులుగా తమిళంలో తెగ హడావుడి చేసిన అజిత్ లేటెస్ మూవీ వివేగం తెలుగులో వివేకం పేరిటి విడుదలైంది. అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమాకు తమిళంలో వచ్చిన హైప్ తెలుగులో లేదనే చెప్పాలి. కనీసం విడుదల తేదీ కూడా చాలా మందికి తెలియని పరిస్థితి. తమిళంలో అజిత్ కి ఉన్న క్రేజ్ రీత్య ఈ సినిమాకు అక్కడ భారీగానే బిజినెస్ జరిగినప్పటికి, బయ్యర్స్ మాత్రం టెన్షన్ పడుతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఇక తెలుగులో ఈ సినిమాకి ఆశించినంత స్థాయిలో బిజినెస్ జరగలేదని టాక్.
అజిత్ నుంచి గతంలో వచ్చిన తెలుగు సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడమే దీనికి మెయిన్ రీజన్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకిక్కించామని చెబుతున్న దర్శకనిర్మాతలు ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ తో వారు చెప్పింది తప్పని నిరూపించుకున్నారు. దర్శకనిర్మాతలు చెబుతున్నంత రేంజ్ లో ఈ సినిమాకు ఖర్చు అవ్వలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. భారీ యాక్షన్ సన్నివేశాలకు పెట్టింది పేరుగా ఉన్న డైరెక్టర్ శివ ఈ సినిమాకు కూడా అదే ఫార్ములాని అప్లై చేశాడు. ఇక్కడ తప్పితే మరెక్కడ ఈ సినిమాలో డబ్బు ఖర్చు పెట్టే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఈ సినిమాల్లో కనిపించే గ్రాఫిక్స్ ఎప్పుడో పాత సినిమాల్లో వాడిన టెక్నాలజీ మాదిరిగా అనిపిస్తుంది. అదే ఈ సినిమాకు పెద్ద మైనస్ అని తెలిసింది. దీనికి తోడు సినిమాకు కూడా ఇప్పుడు డిజాస్టర్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ వర్క్ అవుట్ అయినా, మూడురోజులు తరువాత థియేటర్ల ఖాళీ అయిపోతాయని బయ్యర్లు భయపడుతున్నారని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే ఆ ఓపెనింగ్స్ కూడా తమిళంలోనే ఎక్కువుగా ఉంటాయి, తెలుగులో అజిత్ కి పెద్దగా మార్కెట్ లేదు. మరి వీరందరినీ అజిత్ ఏ రీతిన కాపాడుతాడో చూడాలి.