ఫస్ట్ లుక్: ఎస్ ఎస్ కార్తికేయ 'ఆకాశవాణి'

Update: 2018-11-21 12:19 GMT
ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు ఎస్ ఎస్ కార్తికేయ చిత్ర నిర్మాణంలో ఆడుగుపెడుతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  'షోయింగ్ బిజినెస్' బ్యానర్ తో కార్తికేయ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తాడు. ఈ సంస్థ తమ మొదటి ప్రయత్నంగా 'ఆకాశవాణి' సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్ ను కాసేపటి క్రితం విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ లో రాత్రిపూట ఒక కొండల ప్రాంతం లో రాత్రిపూట చాలామంది జనాలు కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆకాశంలో మొత్తం చుక్కలే.  ఆ రాత్రి చుక్కల మధ్యలో లైట్ గా ఒక రేడియో లాగా ఒక ఆకారం కనిపిస్తోంది. ఆకాశంలో ఒక తోకచుక్క భూమి వైపు వస్తోంది. ఇక  'ఆకాశవాణి' టైటిల్ లోగో  ఓల్డ్ స్టైల్ లో బాగుంది.  ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కే పీరియడ్ సినిమా అని సమాచారం.  

స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ సినిమాకు  డైలాగులు అందిస్తున్నాడు.  సురేష్ రగుతు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాతో అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.  కీరవాణి కుమారుడు కాలభైరవ సంగీతం అందిస్తాడు. జనవరి నుండి షూటింగ్ ప్రారంభమవుతుందట.
Tags:    

Similar News