టాలీవుడ్లో హీరోల కొడుకులు- నిర్మాతల కొడుకులు హీరోలవ్వడం కామనే. కానీ దర్శకుల కొడుకులు హీరోలుగా మారి సక్సెస్ అవ్వడం మాత్రం చాలా తక్కువ. గోపిచంద్- అల్లరి నరేష్ వంటి అతికొద్ది మంది మాత్రమే ఈ జాబితాలో ఉంటారు. కె. రాఘవేంద్రరావు తనయుడి దగ్గర్నుంచి కోదండ రామిరెడ్డి కొడుకు దాకా చాలామంది అలా వచ్చి ఇలా వెళ్లిన వారే. ఇప్పుడు టాలీవుడ్లో టాప్ దర్శకుడిగా చలామణీ అయిన పూరీ జగన్నాత్... తన కొడుకు ఆకాష్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘మెహబూబా’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఆకాష్ కి హీరో కావాలనే కోరిక ఇవ్వాల్టిది కాదుట. 15 ఏళ్ల నుంచి హీరో అవ్వాలని కలగంటున్నానని చెబుతున్నాడు ఆకాష్. రీసెంట్ గా ‘మెహబూబా’ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ఆకాష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పుకొచ్చాడు. ‘సినిమా చాలా బాగా వచ్చింది. మా నాన్న తీసే ప్రేమకథల్లాగే ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ ఇది. దాన్ని తెరకెక్కించిన విధానం కూడా తెలుగువాళ్లకి కొత్తగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు ఆకాష్. ఈ సినిమాలో ఆర్మీ జవానుగా నటిస్తున్న పూరీ తనయుడు... పాత్రలో జీవించడం కోసం ఆర్మీ అధికారులను చాలామందిని నిశితంగా గమనించాడట. కాస్త కష్టమైనా ఇష్టపడి చేశా అంటున్న పూరీ కొడుక్కి ఇష్టమైన హీరో రజినీకాంత్.
మొదటి సినిమా ‘బద్రి’తోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో పనిచేసే లక్కీ ఛాన్స్ కొట్టేసిన పూరీ జగన్నాథ్... ఆ తర్వాత కొన్నేళ్లకి మహేష్ బాబుతో చేసిన ‘పోకిరి’తో ఇండస్ట్రీ అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ఆ తర్వాత పూరీ ఫేట్ మొత్తం మారిపోయింది. స్టార్ డైరెక్టర్ అయ్యాడు. కానీ తనపై పెరిగిన అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. కొడుకు సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని గట్టిగా డిసైడయ్యాడు పూరీ.