పూరీకి గోవా క‌నెక్ష‌న్ గురించి లీకులిచ్చాడు!

Update: 2021-10-20 09:01 GMT
ఆకాశ్ పూరి క‌థానాయ‌కుడిగా న‌టించిన‌ రెండో చిత్రం రొమాంటిక్. అనీల్ పూడూరి ద‌ర్శ‌కుడు. పూరి క‌నెక్ట్స్ ప‌తాకంపై లావ‌ణ్య స‌మ‌ర్ప‌ణ‌లో ఈ మూవీని చార్మి- పూరి ద్వ‌యం స్వ‌యంగా నిర్మిస్తున్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఈ మూవీ రిలీజ్ కి బ్రేకులు ప‌డుతూనే ఉన్నాయి. గోవా స‌హా ప‌లు అంద‌మైన లొకేష‌న్ల‌లో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే రొమాంటిక్ టైటిల్ ని జ‌స్టిఫై చేస్తూ వేడెక్కించే పోస్ట‌ర్ల‌ను రిలీజ్ చేశారు పూరి బృందం. అవ‌న్నీ టీనేజ‌ర్ల‌కు ఇట్టే క‌నెక్ట‌యిపోయాయి. పూరి మార్క్ రొమాన్స్ డెప్త్ ఇన్ ల‌వ్ తెర‌పై క‌నిపిస్తాయని అప్పుడే అంచ‌నా వేసారు.

ఇక ఈ మూవీలో ఆకాష్‌ స‌ర‌స‌న కేతిక శ‌ర్మ అనే కొత్త‌మ్మాయ్ న‌టిస్తోంది. అలాగే వెట‌రన్ స్టార్స్ ర‌మ్య‌కృష్ణ‌.. ఇందులో ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌గా మ‌క‌రంద్ దేశ్ పాండే-మందిరా ఆస‌క్తిక‌ర పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. 2018 ప్ర‌థ‌మార్థంలో `మెహ‌బూబా` లాంటి ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైనా న‌టుడిగా మంచి మార్కులే వేయించుకున్నాడు కాబ‌ట్టి రెండో ప్ర‌య‌త్నం మాత్రం ష్యూర్ షాట్ గా హిట్ కొట్టాల‌న్న పంతంతో ఆకాష్ పూరి ఉన్నాడు. తాజాగా రొమాంటిక్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆకాష్ `రొమాంటిక్` విష‌యాల్ని వెల్ల‌డించారు.

నాన్న‌గారు .. రొమాంటిక్ అనే లైన్ ఎప్పుడో రాసి పెట్టుకున్నారు. ఎన్నో క‌థ‌లు రాసుకుని పెట్టుకుంటారు. న‌చ్చిందా? అని అడిగి చేసేస్తారు అంతే. నాకోసం ప్ర‌త్యేకించి ఒక క‌థ ఏదీ రాయ‌లేదు. ఇక ఈ చిత్రంలో వాస్కోడిగామా నా పాత్ర పేరు. ఈ పాత్ర‌ను నాన్న చెప్ప‌గానే ఎగ‌జ‌యిట్ అయిపోయాను. వెంట‌నే ఓకే చెప్పాను. అలా సెట్స్ కి వెళ్లాం.

ఇందులో క‌థానాయిక కేతిక చాలా అద్భుతంగా చేసింది. దిల్లీ అమ్మాయి.. ఎంతో అద్భుతంగా న‌టించింది. త‌న‌కు ఫాలోయింగ్ బావుంది. త‌ను చాలా ఫ‌న్నీ గాళ్. తెలుగు రాక‌పోయినా నేర్చుకుంటోంది. సెట్లో చాలా జోకులు వేస్తూ ఫ‌న్నీగా ఉంటుంది.

ర‌మ్య‌కృష్ణ లాంటి సీనియ‌ర్ నుంచి చాలా నేర్చుకున్నాం. ఇక త‌న‌తో నాకు ఎక్కువరోజుల షూట్ ఏదీ లేదు. వేగంగా మా పై స‌న్నివేశాల్ని పూర్తి చేశారు. ఈ మూవీకి సంగీతం బాగా కుదిరింది. పాట‌లు అద్భుతంగా ఉన్నాయి. సునీల్ క‌శ్య‌ప్ మ్యాజిక్ ప‌ని చేసింది. రొమాంటిక్ అన్న సినిమాకి ఒక ఫ్లేవ‌ర్ యాడ్ చేసింది అత‌డే. సినిమా ఎలా ఉంటుందో త‌న ఆడియో బీజీఎంతో అర్థ‌మ‌వుతుంది. థియేట‌ర్లో ఎప్పుడు రిలీజ‌వుతుంది చూడాలి అన్నంత ఆస‌క్తిగా ఉన్నాను.

రొమాంటిక్ లో ల‌వ్ యాక్ష‌న్ తో పాటు సెంటిమెంట్ కామెడీ ఉంటుంది. ఇందులో నేను పోలీసాఫీస‌ర్ ని కాదు .. కానీ పోస్ట‌ర్ లో అలా క‌నిపించాను . ఆ రోల్ ఏంటో తెర‌పైనే చూడాలి.  డైలాగులు చాలా న‌చ్చిన‌వి ఉన్నాయి. ఐ ల‌వ్ ఇండియా రూపాయి - ఖ‌ర్చ‌వ్వ‌దు.. ఐ ల‌వ్ యు - స‌ర‌దా తీరిపోద్ది లాంటి డైలాగులు ఎలా పుడ‌తాయో నాన్న‌గారినే అడ‌గాలి.. అని ఆకాష్ తెలిపారు.

ఇక ఈ మూవీని గోవాలో అరుదైన లొకేష‌న్ల‌లో చిత్రీక‌రించాం. గోవాలో లొకేష‌న్ల‌ను ఈ సినిమాలో చూపించినంత కొత్త‌గా ఇంకే సినిమాలో చూపించ‌లేదు. మా డీవోపీ ద‌ర్శ‌కుల కృషి ఇది. గోవాని ఎంతో కొత్త‌గా చూపించారు.

నాన్న ఎంత నిర్మాత అయినా నాన్న నాన్నే.. ఈ సినిమాకి క‌థ స్క్రీన్ ప్లే అన్నీ నాన్న‌గారే. సెట్లో ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసాను. అసిస్టెంట్ గా కో డైరెక్ట‌ర్ గా కూడా చేశాను. ద‌ర్శ‌కుడు అనీల్ గారికి రొమాంటిక్ సినిమాని అప్ప‌గించారు. నా మొద‌టి సినిమాని నాన్న ద‌ర్శ‌కుడు. అనీల్ గారు సీజీ డైరెక్ట‌ర్ గా నాన్న‌తో ఆయ‌న క‌నెక్ట‌యి ఉన్నారు. అత‌డి వ‌ర్క్ పై న‌మ్మ‌కంతో రొమాంటిక్ మూవీని చేయ‌మ‌ని అన్నారు. చేసేశాం.. అని ఆకాష్ ఇంట‌ర్వ్యూ ముగించారు.
Tags:    

Similar News